పవన్ సవాల్ ఇలా ఉంటుందా?

pawan kalyan janasena telugudesamparty

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కు సరికొత్త సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు మాసాలుగా చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ అవినీతి పరుడని బహిరంగంగా విమర్శలు చేశారు. అంతేకాదు ప్రతి పనిలో పర్సంటేజీలు దండుకుంటున్న వారిలో లోకేష్ ఒకరిని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు తాజాగా లోకేష‌ కు, చంద్రబాబుకు విసిరిన తాజా సవాల్ చర్చకు దారితీసింది.

దొడ్డిదారిన మంత్రి అయి…..

నారాలోకేష్ మండలి నుంచి ఎన్నికై మంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. అయితే పవన్ లోకేష్ కు సవాల్ విసిరారు. లోకేష్ ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, దానికి అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. లోకేష్ ను ఇప్పటికే దొడ్డిదారిన మంత్రిని చేశారని, అలాగే సీఎంగా చేయాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు.

సామాన్యుడిని నిలబెట్టి…..

ఇక దమ్ముంటే లోకేష్ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధమవ్వాలని కూడా పవన్ సవాల్ విసిరారు. లోకేష్ మీద పోటీగా తాను ఒక వ్యక్తిని నిలబెడతానని, ఆ వ్యక్తిపైన లోకేష్ గెలవాలని పవన్ సవాల్ విసిరారు. కేవలం ముఖ్యమంత్రి సమీక్షలు, కాన్ఫరెన్స్ లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అదే నేతలు కొనసాగుతున్నారని, కొత్తతరానికి అవకాశం ఇవ్వడం లేదని మండి పడ్డారు. మొత్తం మీద పవన్ కామెంట్స్ తో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మరి పవన్ సవాల్ కు టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*