బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్

pawan kalyan speeches in andhrapradesh

దెందులూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చారు. గూండాయిజం చేస్తూ..రాజకీయం చేస్తానంటే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గంలో కూడా తనకు అభిమానులున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. అణగారిన వర్గాల వారికి జనసేన అండగా ఉంటుందన్నారు. 19 ఏళ్ల వయస్సులోనే తాను సాయుధ పోరాటానికి సిద్ధమయ్యానన్నారు. ఒక్క కులాన్ని నమ్మి తాను పార్టీ పెట్టలేదన్నారు. రౌడీ ఎమ్మెల్యే ఆటకట్టించేందుకే తాను దెందులూరు వచ్చానన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.

జగన్ అంటే బాబుకు భయం……

2014 ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు రాకముందు చంద్రబాబు, లోకేష్ తన వద్దకు డిన్నర్ కు వచ్చారని, ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకున్నప్పటికీ కలసి పనిచేద్దామని తనను వారిద్దరూ కోరారని, జగన్ అంటే చంద్రబాబుకు అంత భయమని పవన్ కల్యాణ్ దెందులూరు సభలో చెప్పారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల చెంత ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని తాను చెప్పానన్నారు. ఒకప్పుడు తెలంగాణలో దొరల పాలన ఎలా సాగిందో….అలాగే ఏపీలో ఇప్పుడు దొరల పాలన సాగుతోందన్నారు. వారు చెప్పిందే వినాలని, ఎవరు చెప్పిన సలహాలు పరిగణనలోకి తీసుకోరన్నారు. ప్రజాగ్రహం పెల్లుబికితే ఎవరూ నిలబడలేరన్నారు. ఆకురౌడీలకు భయపడబోనన్నారు. చింతమనేని వంటి వ్యక్తికి విప్ పదవి ఇస్తారా? చింతమనేని అంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడుతున్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*