పాత సరుకు ఏరేస్తున్న జనసేన !!

జనసేన పార్టీ ఏర్పాటు టైంలో కొత్త వారికి చాన్స్ ఇస్తాం, యువతకు ప్రాధాన్యత ఇస్తామని భారీ ప్రకటనలు ఇచ్చారు. తీరా చూస్తే మాత్రం పాత సరకు కోసం గేలం వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఉన్న పార్టీలలో చోటు లేని వాళ్ళు, అక్కడ ఇమడలేని వాళ్ళు, ఆశావహులు ఇపుడు జనసేనను ఎంచుకుంటున్నారు. అటువంటి వారిలో వైసీపీ నేతలు ముందున్నారు.

అసంతృప్త నేతలు జంప్……

వైసీపీలో ఇపుడు అసమ్మతి నేతలు ఎక్కూవయ్యారు. విశాఖ జిల్లా వరకు చూసుకుంటే వారి జాబితా ఎక్కువగానే ఉంది. నాలుగేళ్ళ పాత ఇంచార్జులుగా చేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి జగన్ బాధ్యతలు అప్పగించడంతో రగులుతున్న వారంతా ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు.

ఉత్తరం నుంచి అలా…..

ఉత్తర నియోజకవర్గం నుంచి కొన్నాళ్ళు ఇంచార్జ్ గా పనిచేసిన పసుపులేటి ఉషాకిరణ్ హఠాత్తుగా జనసేనలో చేరిపోయారు. ఆమె దసరా రోజు పవన్ సమక్షంలో కండువా కప్పేసుకున్నారు. జగన్ పాదయాత్రలో సైతం పాలుపంచుకుని అడుగులో అడుగేసిన ఆమె ఉన్నట్లుండి ఇలా నిర్ణయం తీసుకోవడం వెనక లోలోపల దాగున్న అసంతృప్తి కారణమంటున్నారు. ఆమెను పక్కన పెట్టి కొత్త వారికి అక్కడ ఇంచార్జ్ బాధ్యతలు జగన్ అప్పగించడంతో ఇలా ప్లేట్ ఫిరాయించారని చెబుతున్నారు.

దక్షిణం అంతేనా….

ఇక, దక్షిణం తీసుకుంటే అక్కడ కూడా ఓ మాజీ ఇంచార్జ్ బాగా కలత పడుతున్నారు. ఆయన పార్టీ కోసం పనిచేసినా పక్కన పెట్టారన్న బాధతో ఉన్నారు. ఆయనే కోలా గురువులు. వైసీపీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి ఆయన్ని అవమానపరచారని మత్స్యకారులు మండిపోతున్నారు. పార్టీలో ఉండవద్దంటూ వారంతా గట్టిగా చెబుతున్నారట. ఈ నేపధ్యంలో ఆయన జనసెన వైపు చూస్తున్నారని టాక్. గతంలో ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు. 2009లో ఆయన ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పరిచాయాలు ఇపుడు పనికివస్తున్నాయని, తొందరలోనే పార్టీ మారుస్తారని ప్రచారం సాగుతోంది.

విశాఖ జిల్లాలోనూ…..

ఇక విశాఖ జిల్లాలోనూ వైసీపీలో అసమ్మతి నేతలు ఉన్నారు. ఎలమంచిలి టికెట్ ఆశించి భంగ పడిన బొడ్డేడ ప్రసాద్, మరో నేత ప్రగడ వంటి వారు అక్కడ కొత్త ఇంచార్జ్ రాజుని వ్యతిరేకిస్తున్నారు. వీరు సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అదే విధంగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే బాబూరావు సైతం పార్టీ టికెట్ ఇవ్వదన్న ప్రచారంతో మనస్తాపానికి గురి అయ్యారు. ఆయన కూడా రూట్ మార్చే అవకాశం ఉందని అంటున్నరు. మరి చూదాలి ఏం జరుగుతుందో.

1 Comment on పాత సరుకు ఏరేస్తున్న జనసేన !!

Leave a Reply

Your email address will not be published.


*