వారెవ్వా…కలసి వస్తే…ఆ కుర్చీ…??

ఏపీలో మ‌రో జేడీఎస్‌! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జేడీఎస్ అనే పార్టీ ఏంటో తెలియాలి. క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న సీఎం కుమార‌స్వామి సొంత పార్టీనే జేడీఎస్. అక్క‌డ ఈ ఏడాది మేలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ పార్టీకి అ త్యంత త‌క్కువ ఓట్లే ప‌డ్డాయి. పైగా త‌క్కువ స్థానాల్లోనే విజ‌యం సాధించింది. అయినా కూడా అధికారంలోకి వ‌చ్చేసింది. అదృష్టం కొద్దీ ఏకంగా సీఎం సీటును కైవ‌సం చేసుకుంది. మ‌రి ఇంత‌లా దూసుకుపోతున్న ఈ పార్టీ.. త‌ర‌హాలోనే ఏపీలో నూ జ‌న‌సేన విజృంభిస్తుంద‌ని అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2014లో బీజేపీ-టీడీపీ కూటమి కి మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సేన‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం సొంత‌గానే బ‌రిలోకి దిగాల‌ని భావిస్తోంది. అయితే,ఇటీవ‌ల అధికార టీడీపీ నాయకులు జ‌న‌సేన‌-వైసీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయ‌ని ప్ర‌చారం చేశారు.

ఎప్పుడు ఎదగాలంటూ…..

2019 ఎన్నికల నాటికి జనసేన, వైసీపీల మధ్య పొత్తు కుదురుతుందని కూడా ప్రచారం ప్రారంభించారు. వీరి ఇరువురిని కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేనలో అంతర్మథనం ప్రారంభమైంది. “2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇక మనం ఎప్పుడు ఎదగాలి?” అని జనసేన నేతలు కొందరు పవన్‌కళ్యాణ్ వద్ద వాదన లేవదీశారని తెలిసింది. పైగా వైసీపీకి మద్దతిస్తే.. జగన్ గనుక సీఎం పీఠం ఎక్కితే వచ్చే టర్మ్‌ కూడా మనకి కష్టమవుతుందనీ, మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు కూడా!

ఎక్కువ సీట్లు సాధించడమే….

స్వయంగా పోటీచేసి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఏపీలో చక్రం తిప్పవచ్చునన్నది మెజారిటీ జన సైనికులు, పార్టీ నేతల వాదనగా ఉంది. ఇక కొద్ది రోజులుగా ఏపీలో జ‌న‌సేన కామ్రేడ్ల‌తో సైతం పొత్తు పెట్టుకుంటుంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. తాజాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డంతో జ‌న‌సేన ఒంట‌రి పోరుపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం రసకందా యంలో పడింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపై జనసేన దృష్టిపెట్టగా, కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

కీలకంగా మారనుందా…?

రెండు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ రెండు పక్షాలూ కసరత్తులు చేస్తున్నాయి. జనసేన పాత్ర కీలకంగా మారడంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీ మ‌రో జేడీఎస్ మాదిరిగా త‌క్కువ స్థానాల్లో గెలిచినా. అధికార పార్టీని నిర్ణ‌యించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఇటీవ‌ల ప‌వ‌న్ సైతం తాను ఎందుకు ముఖ్య‌మంత్రిని కాకూడ‌ద‌ని… క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ ప్ర‌స్తావ‌న కూడా తీసుకు వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యం తెలిసిన వారు జ‌న‌నేన‌ను.. ఏపీ జేడీఎస్ అంటూ వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌వ‌న్ పార్టీకి అంత స‌త్తా ఉందో ? లేదో ? ఎన్నిక‌ల ఫ‌లితాలే చెపుతాయ్‌..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*