పవన్ లెక్కలేస్తున్నారా…?

pawan-kalyan-janasena-party

బలమెంతో బరిలోకి దిగితే కానీ తేలదు. కానీ వచ్చే ఎన్నికల్లో తామే చక్రం తిప్పేది అని భావిస్తుంది జనసేన. అందుకు అనుగుణంగా ఏపీలోని ముఖ్యమైన నియోజక వర్గాలపై ఫోకస్ పెట్టి రాజకీయం చేసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అందుకే కామ్రేడ్ లతో మాత్రమే పొత్తు కొనసాగించి రెండు ప్రధాన పార్టీలను వీలైనంతగా దెబ్బకొట్టాలన్న ఆలోచనలతో జనసేన అడుగులు పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఈనేపధ్యంలో అటు టిడిపి బాహాటంగా, తెరవెనుక వైసిపి, జనసేన లోని ముఖ్యులతో టచ్ లో వుంటూ వస్తున్నారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ …

పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ నేతల తో జరిగిన సమీక్షలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రేసులో లేరంటున్న వారు జనసేన తో పొత్తులకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంటే జనసేన బలం గా ఉన్నట్లు వారి చర్యలు చెప్పక చెబుతున్నాయన్నారు. అయితే పవన్ ఏ పార్టీ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల చంద్రబాబు పవన్ తో కలిస్తే తప్పేంటి అని వ్యాఖ్యానించడం తెల్సిందే. 2014 లో టిడిపికి మద్దతును వ్యూహాత్మకంగా ఇచ్చామని పవన్ చెప్పడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*