బాక్సులు ఓపెన్ చేస్తే….??

pawan-kalyan-janasena-party

కొత్తగా వచ్చిన జనసేన పార్టీ రెండు ప్రధాన పార్టీలనూ భయపెడుతోంది. గత నెల 11వ తేదీన పోలింగ్ జరగ్గా ఇప్పటికీ నియోజకవర్గాల వారీగా విశ్లేషించుకున్న నేతలు జనసేన ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ ను ఇటు చంద్రబాబునాయుడు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. అయితే నియోజకవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ భారీ స్థాయిలోనే ఓట్లు రాబట్టుకునే అవకాశముందని తేలింది.

తొలి ఓటరు…..

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ఓ‌టుహక్కు ఉపయోగించుకున్న యువత ఎక్కువగా పవన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కులాలు, మతాలకు అతీతంగా పవన్ ను సినీనటుడిగా అభిమానించే వాళ్లందరూ తమ ఓటును పవన్ పార్టీకే వేశారు. అక్కడ జనసేన సింబల్ గ్లాస్ గుర్తు లేకపోతే మాత్రం ఇతర పార్టీలకు ఓటేశామని బహిరంగంగానే చెబుతుండటం విశేషం. పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలలో బీఎస్పీ, కమ్యునిస్టులతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కాపు సామాజిక వర్గంలోనూ….

ఇక కాపు సామాజికవర్గంలో అత్యధికులు పవన్ వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. పవన్ ప్రయత్నానికి వారు అండగా నిలిచారంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఓటు పవన్ పార్టీకి, ఎంపీ అభ్యర్థి ఓటు ఇతరులకు వేసినట్లు తెలుస్తోంది. అంటే ఎంపీ ఓట్ల విష‍యంలో క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందంటున్నారు. ప్రధానంగా కరడుగట్టిన టీడీపీ, వైసీపీ కుటుంబాలకు చెందిన యువత కూడా పవన్ వైపే మొగ్గు చూపారన్న విషయాలు పోలింగ్ అనంతరం బయటకు వస్తున్నాయి.

ఏదో ఒక పార్టీకి….

దీంతో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో దిగులు మొదలయింది. ముఖ్యంగా యువత, తటస్థులు ఎక్కువ మంది పవన్ పార్టీ వైపు మొగ్గు చూపారంటున్నారు. దీనివల్ల పవన్ కు ఎక్కువ సంఖ్యలో సీట్లు రాకపోయినా ఒక పార్టీని మాత్రం ఓడించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది ఏ పార్టీ అనేది తెలియకున్నా ఎక్కువగా అధికార తెలుగుదేశం పార్టీకే దెబ్బపడుతుందన్న ఆందోళనలో పసుపు పార్టీ నేతలు ఉన్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ ఫలితాల్లో మామూలుగా ఉండదట. మరి 23న ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 16592 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*