పవన్ గెలుపు మీద…??

pawan-kalyan-janasena-party-gajuwaka

ఎగ్టిట్ పోల్ సర్వేలు వెల్లడి అయ్యాక గాజువాక నుంచి పవన్ గెలుపు పై పందేల జోరు ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని సర్వేలు జనసేనకు ఒకటి నుంచి అయిదు సీట్లు ఇవ్వడంతో అందులో కచ్చితంగా గాజువాక ఉంటుందని భావించి పవన్ గెలుపు ఖాయమన్న ధీమాతో జనసైనికులు ఉన్నారు. అదే సమయంలో అక్కడ వైసీపీ గెలుస్తుందని కూడా పందేలు జరుగుతున్నాయి. ఇక పవన్ మెజారిటీ పైన కూడా పందేలు కాయడం విశేషం. పవన్ గాజువాకలో పోటీ చేస్తానని చెప్పినపుడు లక్ష మెజారిటీ అన్నారు. ఇపుడు పాతిక వేలకు తగ్గకుండా పవన్ గెలుస్తాడని అభిమానులు పందేలకు రెడీ అటున్నారు.

జేడీ మీద కూడా…

ఇక లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఒక ఎంపీ సీటు ఇచ్చారు. ఆ ఎంపీ సీటు విశాఖ అని గట్టినా నమ్ముతున్న పవన్ ఫ్యాన్స్ క్రాస్ ఓటింగ్ తో జేడీ నెగ్గుతారని గట్టి నమ్మకంతో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా జేడీ ఎంపీ అంటూ జనసేనలో హుషార్ కనిపిస్తోంది. పూర్తిగా పట్టణ ప్రాంతం ఆధిపత్యం ఉన్న విశాఖ ఎంపీ సీటులో జేడీ మ్యాజిక్ బాగా పనిచేసిందని అన్ని పార్టీల నుంచి కూడా ఆయనకు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. దీంతో జనసేనలో ఉత్సాహం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితులలోనూ విశాఖ నుంచి పవన్ కళ్యాణ్, జేడీ గెలిచి తీరుతారని అంటున్నారు. జేడీ గెలుపుపై పందేలకూ రెడీ అయిపోతున్నారు.

చీల్చే ఓటు ఎవరిది….?

ఇక జనసేనకు ఈసారి ఎన్నికల్లో ఏడు నుంచి పది శాతం ఓట్లు కూడా వస్తాయని సర్వేలు చెప్పడంతో ఎవరికి నష్టం జరిగిందోనని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ కంగారు పడుతున్నాయి. నిన్నటి వరకూ ఎలమంచిలిలో టీడీపీ గెలుపు ఖాయమనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అక్కడ జనసేన చీల్చే ఓట్లపై బెంగపెట్టుకున్నారు. అదే విధంగా అనకాపల్లిలో కూడా జనసేన ఓట్లు టీడీపీకి గండి కొట్టాయా…? అన్న చర్చ సాగుతోంది. ఇక పెందుర్తి, చోడవరం, పాయకరావుపేటల్లో సైతం జనసేన ఎంతో కొంత ఓట్లు చీల్చినా అక్కడ టీడీపీ అభ్యర్ధులు ఓటమి పాలు అవుతారని తమ్ముళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి గాజు గ్లాస్ పూర్తిగా నిండకపోయినా సగమైనా విశాఖ జిల్లాలో నిండుతుందని ఆ పార్టీ అభిమానులు హుషార్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Ravi Batchali
About Ravi Batchali 16592 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*