జగన్ దూకుడు ముందు పవన్ ఎంత…??

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేసేలా కార్యాచ‌ర‌ణతో ముందుకు సాగాలి. ముఖ్యంగా సీఎం సీటును కాంక్షిస్తున్న ప‌వ‌న్‌.. ప్ర‌జ‌లకు వివరిస్తున్న తన కార్యాచరణ ఏమీ క‌నిపించ‌డం లేదు. ఏదో ఒక స‌భ పెట్టి నాలుగు విమ‌ర్శ‌లు చేయ‌డం.. అటు జ‌గ‌న్‌.. ఇటు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం త‌ప్ప ఆయ‌న చేస్తున్న ప‌ని అంటూ ఏమీ క‌నిపించ‌డంలేదు. నిజానికి నాయ‌కుడుగా ఉన్న ప‌వ‌న్‌.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఏదైనా పోరాటానికి దిగాలి., కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌టంటే.. ఒక్క పోరుకు కూడా దిగ‌లేదు. పైగా ప్ర‌త్యేక హోదా కోసం అది చేస్తా.. ఇది చేస్తా.. అని చెప్పే ప‌వ‌న్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ దూకుడుతో…..

ఎలాంటి పోరూ చేయ కుండానే.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ల‌బ్ధినీ చేకూర్చ‌కుండానే సీఎం సీటు కావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న నాయ‌కుడిగా ప‌వ‌న్‌ను వెక్కిరిస్తుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ అనేక దీక్ష‌లు చేశారు. రైతుల కోసం.. మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర కోసం.. రాజ‌ధాని భూముల విష‌యంలోను.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్‌.. దూకుడుగా ఉన్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా కోసం. విశాఖ‌లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వ‌హించాల‌ని భావించ‌డం.,. దీనిని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డుకోవడం తెలిసి కూడా ప‌వ‌న్‌.. ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో పొద్దుపుచ్చుతున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన ప‌వ‌న్‌.. మ‌రి ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నం ఏదైనా ఉంటే చెప్పాల్సి ఉంది.

అసెంబ్లీకి వెళితే…..?

చంద్రబాబు తప్పులు చేస్తున్నారు. మీరు శాసనసభకు వెళ్లండి. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేని నేను ఇన్ని ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తున్నాను. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వెళ్లకుంటే ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఓదార్పు యాత్రలు చేస్తుంటే ఎలా? మీరు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై నిలదీస్తే అప్పుడు మీ మగతనం బయటకి వస్తుంది- అంటూ ప‌వ‌న్ తాజాగా గొప్ప‌లు పోయాడు. అయితే, వాస్త‌వానికి అసెంబ్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఏమిటి? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు సంత‌లో ప‌శువుల్లా కొనేస్తుంటే.. అప్పుడు ప‌వ‌న్‌కు నోరు ఏమైంది? బాబుతో క‌లిసి ఉన్న‌ప్పుడు… ఇప్పుడు చెబుతున్న విలువ‌లు గుర్తు లేవా? అప్పుడు ప్ర‌శ్నించ‌లేని నాయ‌కుడు.. ఇప్ప‌డు ప్ర‌శ్నించే అర్హ‌త ఉంటుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

జనసేన గ్రాఫ్…..

ఇక ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న వేళ జ‌న‌సేన గ్రాఫ్ రోజు రోజుకు ఏమైనా పెరుగుతుందా ? అంటే నో అనే ఆన్స‌రే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప‌వ‌న్ పార్టీకి ఇంకా స‌రైన నాయ‌కులే లేరు. ప‌వ‌న్ ఆలోచ‌నా ధోర‌ణి సైతం అలాగే ఉంది. ఇక ప‌వ‌న్ పోరాట ప‌టిమ‌తో కూడిన రాజ‌కీయాలు వ‌దిలేసి… కేవ‌లం విమ‌ర్శ‌నాత్మ‌క రాజ‌కీయాలు చేయ‌డం ఎవ‌రికి మాత్రం న‌చ్చుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*