కుట్రలు చేస్తే కచేరీ ఖాయమా…?

pawan-kalyan-on-ys-jaganmohanreddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారో? అర్థం కాకుండా ఉంది. అధికార పార్టీపై పోరాడాల్సిన ఆయన ప్రతిపక్షనేతను టార్గెట్ చేసుకోవడం విస్మయం కలిగించే విషయమే. ఎప్పటి సంగతులో ఈ ఎన్నికల్లో తెచ్చి చంద్రబాబుకు పరోక్ష సహకారం అందించాలనుకుంటున్నట్లు కన్పిస్తోంది. పవన్ ప్రతి సభలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకుని ప్రసంగిస్తుండటం వెనక ఆయన ఓట్లలో చీలిక తెచ్చే కుట్ర కనపడుతుందంటున్నారు వైసీపీ నేతలు.

జగన్ నే లక్ష్యంగా చేసుకుని…..

హైదరాబాద్ లో జరిగిన సభలో సయితం జగన్ నే లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారు. ఉద్యమ సమయంలో జరిగిన మానుకోట సంఘటనను ఆయన ప్రస్తావించారు. దశాబ్దాల క్రితం అన్నపూర్ణ స్టూడియో వద్ద పేలిన కారు బాంబు గురించి చెప్పారు. ఇవన్నీ జగన్ కు నష్టం కలిగించేందుకే పవన్ ఈ వ్యాఖ్యలను చేస్తున్నట్లు కనపడుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ ప్రసంగాలు దాదాపు పోలి ఉండటం గమనార్హం. జగన్ కు ఓటేస్తే రౌడీ రాజ్యం వస్తుందని, సొంత ఇంట్లో కూడా అద్దెకుండాల్సి వస్తుందని ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఫలితాలను ఊహించారా?

పవన్ కల్యాణ్ జగన్ పై ధ్వజమెత్తడానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేనని అంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకమయితే తాను టీడీపీ మద్దతిచ్చేందుకు ఇప్పటి నుంచే పవన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కర్ణాటక తరహా ఫలితాలు ఆంధ్రపద్రేశ్ లో వస్తాయని పవన్ ఆశపడుతున్నారు. అదే జరిగితే తాను కీలకం కావచ్చని, తాను టీడీపీ వైపు ఉండేందుకే ఇప్పటి నుంచి జగన్ ను టార్గెట్ చేయడం మంచిదని పవన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

భవిష్యత్తులోనూ…..

ఇక సుదూర రాజకీయ భవిష్యత్తులో కూడా జగన్ మాత్రమే తనకు ప్రత్యర్థిగా ఉంటారని పవన్ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబునాయుడు తర్వాత సమర్థవంతమైన నేత మరొకరు లేరని, జగన్ ను ఎప్పటికైనా, ఏ ఎన్నికల్లోనైనా తానే ఎదుర్కొనాల్సి ఉంటుందని, ఏపీలో ఎప్పటికైనా తనకు, జగన్ కు మధ్యనే ఎన్నికల యుద్ధం జరుగుతుందని పవన్ విశ్వసిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించకూడదన్న లక్ష్యంతో పవన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ పోకడలు మహా కుట్రలను తలపిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ తగ్గకపోవడం వెనక తనకు, తన పార్టీ రాజకీయ భవిష్యత్తు కోసమేనన్నది కాదనలేని వాస్తవం.

Ravi Batchali
About Ravi Batchali 27877 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on కుట్రలు చేస్తే కచేరీ ఖాయమా…?

  1. Thu nee article nuvuu… JSP and JSP meeting okkasaraina cover chesava???? ante neeku reddy valla varthale rastava… leda OC valla varthale rastava??? enduku ee article?? Bhayamestundaaa Pawan Kalyan ni choostunte??? ok mosagadike ela support chesustunnavu nuvvuu?? neeku Patrika viluvalu leva??? okasaraina nijanga nijamaina varthalu rayi… euppdu aa Fraudster Jagan varthalena… thu nee bhathuku.

Leave a Reply

Your email address will not be published.


*