బాలరాజుకి ఢిల్లీ దారి చూపిస్తున్నారా !!

Andhra Pradesh elections 2019 telugu post telugu news

రాజకీయ పార్టీల్లో చేరడం వరకే స్వేచ్చ. ఆ మీదట అధినాయకుడి ఇష్టమే చెల్లుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో చూసుకుంటే అధ్యక్షుడి మాటే వేదంగా సాగుతుంది. జాతీయ పార్టీలో ఉంటూ సంపూర్ణంగా స్వేచ్చను అనుభవించిన వారు, భావ ప్రకటనా హక్కుని కోరుకునే వారు ప్రాంతీయ పార్టీలో ఇమడలేరు. ఇక సున్నితంగా ఉంటూ రాజకీయాలు చేసే వారు అసలు ఉండలేరు. విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఇపుడు అలాంటి సందిగ్దంలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ మధ్యనే జనసేనలో చేరిన ఆయనకు తత్వం ఇప్పుడిపుడే బోధపడుతోందట.

అన్నింటికీ అనుమతా..?

ఇక జనసేనలో సీనియర్ నాయకుడిగా బాలరాజుని చెప్పుకోవాలి. ఆయన 1989లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతటి సీనియర్ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా హైకమాండ్ అనుమతి తీసుకోవాలని అంటున్నారట. అంతే కాదు, ఏ ప్రెస్ మీట్లో ఏం చెబుతారో కూడా ముందే పేపర్ మీద రాసి పార్టీ ఆఫీస్ కి పంపి రాజముద్ర వేయించుకోవాలట. ఇక ఇవన్నీ పూర్తి అయితేనే మీడియా ముందుకు రావాలట. మరి అప్పటికపుడు ఏదైన ఇష్యూ జరిగితే వెంటనే స్పందించేందుకు అవకాశం ఎక్కడిది, ఈ అనుమతులు వచ్చేలోగా ఆ ఇష్యూ వేడి తగ్గిపోదా, ఇక ప్రెస్ మీట్ పెట్టి లాభమేంటి ఇదే మాజీ మంత్రిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యట.

కామ్రేడ్ ఝలక్

ఇక జనసేనలో చేరినపుడే పాడేరు నుంచి పోటీ చేయడానికి బాలరాజు ఫిక్స్ అయిపోయారు. అక్కడ ఆయనకు బాగా పట్టుంది. పైగా 2009లో అక్కడ నుంచి పోటీ చేసి మంత్రి కూడా అయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాడేరు టికెట్ ఖాయమని అనుకున్నారు. అయితే చిత్రంగా ఆ సీటుని వామపక్షాలకు కేటాయించాలన్న ఆలోచనలో జనసేన ఉందట. దాంతో బాలరాజును అరకు ఎంపీ సీటుకు పోటీ చేయామంటున్నారు. ఈ పరిణామంతో ఖంగు తినడం మాజీ మంత్రి గారి వంతు అవుతోంది. ఎంపీ అంటే మాటలా. అదీ తక్కువ సమయం, పార్టీ కూడా బలపడలేదు, పైగా బోలెడు ఖర్చు, అరకు పార్లమెంట్ అయిదు జిల్లాలకు విస్తరించి ఉంది దీంతో బాలరాజు వర్గీయులు కలవరపడుతున్నారట. మరి ఏం చేయాలో ఆయనకు పాలుపోవడంలేదని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*