స్ట్రయిట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ అయిందే …?

కవరేజ్ ఎంత కష్టపడితే ఏముంది. అదే ఒక్క సంచలన వ్యాఖ్యతో మీడియా అటెన్షన్ మొత్తం తమ వైపే డ్రా చేయొచ్చు. అది మంచైనా చెడైనా కావొచ్చు.రాజకీయాల్లో వున్న నేతలు నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకోగల ఓర్పు నేర్పు ఉంటే చాలు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా అనుసరిస్తున్నారు నాయకులు . నెగిటివ్ వార్తలకే అటు మీడియా లోను ఇటు ప్రజల్లో సైతం పెద్ద పీట వెయ్యడం ఇటీవల బాగా పెరిగిపోయింది.

స్వరం పెంచిన బాబు …

చంద్రబాబు స్వరం లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా కూల్ గా మాట్లాడే బాబు ఇప్పుడు బహిరంగ సభల్లో సవాళ్ళు ప్రత్యర్థులకు విసురుతున్నారు. ఛాలెంజ్ అంటున్నారు. లోకేష్ సైతం జోరు బాగా పెంచేశారు. పెదబాబు చినబాబు కేంద్రంపై ఒంటికాలిపై లేస్తున్నారు. జగన్, పవన్ దుమ్ము దులిపేస్తూ తమ సహజశైలికి భిన్నంగా ఘాటైన పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా సాధారణ మీడియా కవరేజ్ తో బాటు సోషల్ మీడియా ను టార్గెట్ చేసేందుకు అన్నది విశ్లేషకుల విశ్లేషణ.

జగన్ మాములుగా లేరుగా …

ఇక వైసిపి చీఫ్ జగన్ పూర్తిగా మారిపోయారు. టిడిపి మీడియా లోను ఆయన హవానే కొనసాగుతుంది. టివి చర్చల్లోనూ ఆయనే వుంటున్నారు. పవన్ వ్యక్తిగత జీవితం నుంచి కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదనే వరకు జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో మీడియా మొత్తం ఆయనే నిండిపోయారు. ఇడుపులపాయ నుంచి రెండున్నరవేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినా రాని కవరేజ్ ఇటీవల ఆయన పొందారు. దీనికి కారణం ఆయన చేసిన వ్యాఖ్యలే పెనుదుమారానికి సంచలనానికి దారితీస్తున్నాయి.

సింహనాదం చేస్తున్న పవన్ కళ్యాణ్ …

మీడియా బాధితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టిడిపి మీడియా దృష్టిని బాగానే ఇటీవల ఆకర్షిస్తున్నారు. సభల్లో ఆయన జనం కన్నా ఎక్కువ అరుపులు అరుస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నారు. సంచనల వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. మీడియా సెంటర్ చేసే ఏ పాయింట్ ఆయన మిస్ కాకుండా చూసుకుంటున్నారు.

ఇక ప్రతిరోజు కీలకమే …

రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి నుంచి కామ్రేడ్ ల వరకు జోరు పెంచారు. ఎన్నికల తరుణం ఆసన్నం కావడంతో ఎవరికివారు ప్రజల్లోకి దూసుకుపోయే కార్యాచరణ రూపొందించుకోవడంతో బాటు సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టి తమ తమ పార్టీల మైలేజ్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఓటు బ్యాంక్ లు లేని పార్టీలకు సాధారణ మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని స్థితిలో వీరంతా సోషల్ మీడియా పై బాగా ఆధారపడ్డారు. ఫెస్ బుక్ లైవ్, లు యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికలపై విజృంభిస్తున్నారు. వీలైనంత నెగిటివ్ కామెంట్స్ కె అన్ని పార్టీలు ఇప్పుడు ప్రాధాన్యత పెంచి ప్రజల్లో తమ కోసం చర్చ నడిచేలా జాగర్త పడటం విశేషమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*