వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ప‌వ‌న్‌కు ప్ల‌స్ అవుతుందా…?

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మారింది ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్తితి! ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌లు చాలా ప్ర‌తిష్టా త్మ‌కంగా మార‌నున్నాయి. ముఖ్యంగాఅ ధికార టీడీపీ తిరిగి అధికారాన్ని ద‌క్కించుకునేందుకు తాప‌త్ర‌య ప‌డుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదికారం కోసం వైసీపీ మ‌రింత‌గా పాటు ప‌డుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో కొద్దిపాటి తేడాతో అధికారానికి దూర‌మైన ఈ పార్టీ.. ఆర్థికంగాను, నాయ‌కుల్లో ఆత్మ‌స్థ‌యిర్యం విష‌యంలోనూ చాలా ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఈ నేప థ్యంలో ఈ రెండు పార్టీలు చాలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తున్నాయి. అంటే కేవ‌లం గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఇక్క‌డే ఈ రెండు పార్టీల‌కు వివాదం చెల‌రేగుతోంది.

స్వరం పెంచుతున్న…..

టీడీపీ, వైసీపీల‌కు బ‌లం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంటే.. ఇక‌, బ‌లం లేని హోరా హోరీ పోరు జ‌రిగే స్థానాల్లో ప‌రిస్థితి ఏంట‌నే విష‌యంపై ఇరు పార్టీలూ త‌ల్లడిల్లుతున్నాయి. అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఎప్పటిక‌ప్పుడు సిట్టింగు ఎమ్మెల్యేల‌కు వార్నింగులు ఇస్తూనే ఉన్నారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని, లేకుంటే తాను ఏం చేయాలో అది చేస్తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయినా కూడా త‌మ్ముళ్లు త‌మ ప‌ద్ధ‌తిని మార్చుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లువులు సిట్టింగులను చంద్ర‌బాబు టికెట్‌ను నిరాక‌రించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఆశావ‌హుల సంగ‌తి మామూలే. కొంద‌రు ఇప్ప‌టికే పార్టీఅధినేత‌కు బాహాటంగా నే త‌మ‌కు టికెట్ ఇవ్వాల్సిందేన‌నే డిమాండ్ స్వ‌రాన్ని వినిపిస్తున్నారు.

ఆ నియోజకవర్గాల్లో సీనియర్లు…..

అంతేకాదు,.. ఇలాంటి వారు త‌మ‌ను అవ‌మానిస్తే.. త‌మ దారి తాము చూసుకుంటామంటూ.. తెర‌చాటుగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ప్ర‌ధానంగా వైసీపీ నుంచి జంప్ చేసి వ‌చ్చిన 20 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సిట్టింగుల‌కు టికెట్ ఇస్తే.. మా ప‌రిస్థితి ఏంట‌ని టీడీపీ సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నియోజ‌క‌వ‌ర్గాల బ‌లాబ‌లాను తెలుసుకుంటున్న జ‌గ‌న్‌.. గ‌త నాలుగేళ్లుగా ఉన్న స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను సైతం మారుస్తున్నా రు. అంతేకాదు, నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కు మొహం తెలియ‌నివారు కూడా రంగంలోకి దిగేలా జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఉంటున్నా యి. దీంతో వీరంతా కూడా ఇక‌, జ‌గ‌న్‌కు గుడ్ బై చెప్పాలనే ప‌రిస్థితి వ‌స్తుండ‌డం రాజ‌కీయాల‌ను మ‌రింత వేడి పుట్టిస్తోంది.

రెబల్స్ చూపు…..

మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఉభ‌య గోదావ‌రులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ, టీడీపీల‌లో ప‌రిస్థితి ఇలా త‌యారైంది. ఈ క్ర‌మంలో ఇలా అసంతృప్తులు ఏం చేయాలి? ఈ ప్ర‌శ్న‌కు గ‌తంలో అయి తే..రెబ‌ల్‌గా మారి త‌మ స‌త్తా చూపించేవారు నాయ‌కులు. తమ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒంట‌రిగానే పోరుకుదిగి.. గెలిచి చూపించేవారు. అయితే, ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇలాంటి వారికి ప్ర‌త్యామ్నాయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి కొత్త వారికి త‌ప్ప త‌న పార్టీలో సీనియ‌ర్లు, ఇత‌ర పార్టీల వారికి ఛాన్స్ లేద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యం, రాజ‌కీయాలు మారుతున్న ప‌రిణామాల ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటు టీడీపీ, అటువైసీపీలోని అసంతృప్తుల‌కు ప‌వ‌న్ త‌న పార్టీ జెండా క‌ప్పి త‌ర్థం ఇస్తున్నారు. అంతిమంగా. జ‌న‌సేన ల‌బ్ధి పొందుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*