పవన్ స్టెప్ లు మామూలుగా లేవుగా….??

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్ స్ట్రాట‌జీ ఏంటన్నది ఓ సామాన్య ఓటరుకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. రాజకీయంగా పవన్‌ నిన్న మొన్నటి వరకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై డైలమాలోనే ఉన్నాడన్నది వాస్తవం. చివరకు తాను పోటీ చేసే నియోజకవర్గంపై కూడా పవన్‌కు స్పష్టమైన క్లారిటీ లేదు. పవన్‌ ఇప్పటికే తాను పోటీ చేస్తానంటూ ఏకంగా ఏడు నియోజకవర్గాల్లో బహిరంగ ప్రకటనలు చేశాడు. చివరకు పాడేరు లాంటి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో సైతం తాను పోటీ చేస్తానని చెప్పి రాజకీయ గందరగోళానికి తెర తీశాడు. అసలు పవన్‌కు పొలిటికల్ స్ట్రాటజి ఉందా ? ఆయన ప్లాన్‌ ఏంటన్నది ఎవ్వరికి అర్థం కాలేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ తాను పిఠాపురం నుంచి పోటీ చేసే ఆలోచన కూడా ఉందని మరో సారి షాక్‌ ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపికలో…..

పవన్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయంలో తనలో తనకే క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నా కొన్ని విషయాల్లో మాత్రం అతడు పన్నుతున్న వ్యూహాలు ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలకు సైతం షాక్‌ ఇస్తున్నాయి. జనసేన ప్రభావం బలంగా ఉందని అందరూ భావిస్తున్నా ఏపీలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో 2009లో పవన్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జిల్లాల్లో ఉన్న 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు మినహాయిస్తే ఉన్న 15 జనరల్‌ సీట్లలో ఏకంగా 11 సీట్లను ఒకే సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ప్రజారాజ్యం ఏకంగా 10 సీట్లకు పైగా సాధిస్తుందని అంచనాలు ఉన్నా కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది.

చిరు రాంగ్ స్టెప్ వల్లనే….

ఆ ఎన్నికల్లో చిరు అండ్‌ టీమ్‌ వేసిన రాంగ్‌ స్టెప్పలతోనే జిల్లాలో ప్రజారాజ్యం నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. అయితే అభ్య‌ర్థుల ఎంపిక‌లో వేసిన రాంగ్ స్టెప్పుల‌తో పాటు సామాజిక ఈక్వేష‌న్ల బ్యాలెన్స్ మిస్ కావ‌డంతో చాలా నియోజకవర్గాల్లో రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే ఇప్పుడు పవన్‌ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో మాత్రం అదిరిపోయే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తన సొంత సామాజికవర్గాన్ని మాత్ర‌మే కాకుండా జిల్లాల్లో బలంగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గంలో పాటు కమ్మ, కాపు, వైశ్య‌ ఇలా ప్రతి ఒక్క సామాజికవర్గాన్ని కలుపుకుని ముందుకు ముందుకు వెళ్తుండడంతో పాటు ఈ సామాజికవర్గాలకి చెందిన వారికి కూడా సీట్లు కేటాయించే ఆలోచన చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గానికి తూర్పుగోదావరి జిల్లాలో మూడు నుంచి నాలుగు సీట్లు కేటాయించాలని పవన్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

వారికి అధిక ప్రాధాన్యత…..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే జనసేన తొలి అభ్యర్థిగా ఖ‌రారు అయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ఈ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. ముమ్మడివరంతో పాటు రామచంద్రపురం, మరో సీటు సైతం (వీలును బ‌ట్టి కాకినాడ రూర‌ల్‌) ఈ జిల్లాలో శెట్టిబలిజలకు ఇవ్వాలని పవన్‌ భావిస్తున్నారు. అదే టైమ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో సైతం ఒకటి, రెండు సీట్లు ఇదే సామాజికవర్గానికి ఇవ్వాలన్నదే పవన్‌ ప్లాన్‌. తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెన్నుదండుగా నిలుస్తూ వస్తున్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఓటర్లుపై పవన్‌ గురి పెడితే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడనుంది. పవన్‌కు ఎలాగో తన సొంత సామాజికవర్గం ఉంది.

ఆ ఓట్లను చీల్చగలిగితే….

ఈ క్రమంలోనే శెట్టిబలిజ సామాజికవర్గాన్ని ఆకట్టుకుని ఆ వర్గం ఓటర్లను చీలిస్తే జనసేన ప్రభావం గట్టిగా ఉండనుంది. ఇప్పటికే పితాని బాలకృష్ణకు సీటు కేటాయించడం ద్వారా బీసీలపై తనకున్న ప్రేమను చాటిచెప్పిన పవన్‌ ఇప్పుడు తన ఎన్నికల హామీలో శెట్టిబలిజలకు కార్పోరేషన్‌ ఏర్పాటుపై సాధ్యాసాధాలు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే సామాజికవర్గానికి చెందిన మహిళా లీడర్ క‌డ‌లి ఈశ్వరి పేరు కాకినాడ రూరల్‌ నుంచి కూడా చర్చకు వస్తోంది. ఏదేమైనా పవన్‌ కొన్ని గందరగోళ నిర్ణయాలు తీసుకున్నా… తూర్పుగోదావరి జిల్లా విషయంలో మాత్రం మంచి స్ట్రాట‌జీతోనే ఎన్నికలకు వెళ్తున్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. మరి ఈ వ్యూహాలు ఎలా ? ఫలిస్తాయో జిల్లాల్లో జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*