జ‌న‌సేన‌లోకి రెండు బిగ్ వికెట్స్ ..!

చాప‌కింద నీరులా జ‌న‌సేన విస్తరిస్తుందా..? ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? ఇది అధికార టీడీపీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌లో కుదుపున‌కు దారి తీస్తుందా..? జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ త‌న అభ్య‌ర్థుల‌ను సైలెంట్‌గా ఎంపిక చేస్తూ పోతున్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఏపీలో అధికారానికి ప్ర‌ధాన‌మైన తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌రికొద్ది రోజుల్లోనే రాజ‌కీయంగా సంచ‌ల‌నం చోటుచేసుకుంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇద్ద‌రు ముఖ్య నేత‌లు జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు పోటీ చేసే స్థానాలు కూడా దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లు కూడా తెలుస్తోంది. ఆ నాయ‌కులు మ‌రెవ‌రో కాదు.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌, మ‌రొక‌రు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ.

హర్షకుమార్ రాకతో…..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌లాపురం లోక్‌స‌భ స్థానం నుంచి హ‌ర్ష‌కుమార్ పోటీ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ మేర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సామాజిక బ‌లానికి ప‌వ‌న్ ఇమేజ్ తోడైతే.. ఇక ఆయ‌న గెలుపు సుల‌భ‌మేన‌ని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అమ‌లాపురం నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనూ మూడోసారి రాష్ట్ర విభ‌జ‌న ప‌రిణామాల నేప‌థ్యంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరి కేవ‌లం 9 వేల ఓట్లు మాత్ర‌మే తెచ్చుకున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న జ‌న‌సేన నుంచి అమ‌లాపురం ఎంపీగా పోటీ చేస్తే ఎస్సీ ఓటింగ్‌తో పాటు ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఈ సెగ్మెంట్‌లో బ‌లంగా ఉండ‌డంతో త‌న గెలుపు సులువు అవుతుంద‌న్న అంచ‌నాలో ఆయ‌న ఉన్నారు. అలాగే కోన‌సీమ‌లో ఉన్న మూడు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి ఆయ‌న త‌న‌యుడిని అసెంబ్లీకి కూడా పోటీ చేయించాల‌న్న ప్లాన్‌తో ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆకుల కూడా…..

ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ కూడా జ‌న‌సేన పార్టీ నుంచి రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇది కూడా దాదాపుగా ఖాయ‌మైపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ మాత్రం ఆకుల విష‌యంలో ఎంపీగా కంటే రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం. ఎంపీగా కంటే వీలైన‌న్ని ఎక్కువ అసెంబ్లీ సీట్లే గెలుచుకోవాల‌న్న వ్యూహంలో ప‌వ‌న్ ఆకుల విష‌యంలో ఈ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు జ‌న‌సేనలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీనియర్ ఎమ్మెల్యే ఒకరు…..

ఇదే జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యే కూడా జ‌న‌సేన‌లో చేరుతార‌నే టాక్ వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఆయ‌న ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గ‌తంలోనూ ప్ర‌జారాజ్యం నుంచి అసెంబ్లీకి పోటీ ప‌డిన వారే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ నుంచే బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా జ‌న‌సేన నాయ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల ముంగిట వీరితోపాటు మ‌రికొంద‌రు నాయ‌కుల చేరిక‌ను ప్ర‌క‌టించి, రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించాల‌ని, ఒక్క‌సారిగా హైప్ క్రియేట్ చేసి జ‌నాన్ని త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న‌ది ప‌వ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని ఉత్త‌రాంధ్ర‌లో కూడా ప‌వ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి.. ప‌వ‌న్ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తోపాటు ఉత్త‌రాంధ్ర‌పైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*