అక్కడ బలాబలాలు సమానమేనా…?

అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నారంటే.. ఎలాంటి స‌మ‌స్య అయి నా ప‌రిష్కారం కావాల్సిందే. అలాంటి నాయకుడు మ‌రో ఆరు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌చించిన వ్యూహం ఫ‌లిత‌మిస్తుందా? లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ‌, కోస్తా జిల్లాల్లో ఓటింగ్ స‌ర‌ళి, ఎన్నిక‌లు వంటివి అంద‌రికీ తెలిసిందే. అయితే, తూర్పున ఉన్న మూడు ప్ర‌ధాన జిల్లాలు విశాఖ‌, విజ‌య న‌గరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? అక్క‌డ ఏ పార్టీకి ప్ర‌జ‌లు అండ‌గా నిలుస్తారు? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. సీమ‌లోని నాలుగు జిల్లాల్లోనూ వైసీపీ అధినేత జ‌గ‌న్ కు బ‌లం ఉంది. ఇక్క‌డి రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తం ఆయ న‌కు అండ‌గా నిలుస్తోంది.

ఈ జిల్లాల్లో మాత్రం….

అయితే, ఈ సీమ జిల్లాల్లోనే అనంత‌పురంలో మాత్రం టీడీపీ హ‌వా కొద్దిగా క‌నిపిస్తోంది. ఇక‌, గుంటూరు, కృష్ణాల్లోనూ టీడీపీకి ఆశించిన విధంగానే ఉంది. ఇక‌, ప‌శ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన కాపుల హామీ బాగా వ‌ర్క‌వుట్ అ యింది. దీనికి తోడు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర కూడా అమోఘంగా ప‌నిచేసింది. దీంతో ఈ రెండు జిల్లాల‌లో టీడీపీ దూకుడు ప్రదర్శించింది. మరి ఈసారి మాత్రం అది పనిచేయదు. ఇక‌, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల్లో ప‌రిస్థితి ఎవ‌రికి ఎలా ఉప‌యోగంగా మారు తుంది? ఈ జిల్లాల ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యం త‌ర‌చుగా వార్త‌ల్లోకి వ‌స్తోంది.

పవన్ వ్యూహాత్మకంగా….

ఇప్పుడు ఈ విష‌యంలోకి వ‌స్తే.. టీడీపీ కానీ, వైసీపీ కానీ ఈ మూడు జిల్లాల్లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు పెద్ద‌గా పుంజుకోలేద‌నే చెప్పాలి. ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల్లో ప‌వ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించారు. త‌న పార్టీ త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మం ప్రారంభించాల‌న్నా.. స‌మ‌స్య‌ల పై పోరాటం చేయాల‌న్నా.. కూడా ప‌వ‌న్ శ్రీకాకుళాన్నే ఎంచుకున్నారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు. పోరు యాత్ర ప్రారంభం కూడా ఇక్క‌డి నుంచే మొద‌లు పెట్టారు. ఉద్దానం బాధితుల‌కు అండ‌గా నిలిచారు. ఇలా మొత్తంగా ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు టీడీపీకి కూడా ఇక్క‌డ పాగా వేసేందుకు ఛాన్స్ ల‌భించింది.

తిత్లీ…కత్తిదాడి…..

శ్రీకాకుళాన్ని అత‌లాకుత‌లం చేసిన తిత్లీ తుఫాను అధికార పార్టీకి వ‌రంగా మారింది. ఇక్క డే చంద్ర‌బాబు తిష్ట వేసి.. బాధితుల‌కు అండ‌గా నిలిచారు. ఫ‌లితంగా ఇప్పుడు టీడీపీకి కొద్దిగా ఊపు క‌నిపిస్తోంది. మూడో వైసీపీ విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ పాద‌యాత్ర కీల‌కంగా మారుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై క‌త్తి దాడి జ‌ర‌గ‌డం సంచ‌ల నంగా మారింది. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్రకు బ్రేక్ ప‌డింది. ఈ యాత్ర పుంజుకుని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ జెండా ఎగిరితేనే ఇక్క‌డ జ‌గ‌న్‌కు అవ‌కాశం ఉంటుంది. ఇక జ‌న‌సేన సైతం ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఫైట్ చేయ‌డంతో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ గెలుస్తుంద‌న్న ప్ర‌చార‌మూ ఉంది. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో టీడీపీకి కాస్త ఎడ్జ్ మాత్ర‌మే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*