మీదైతే బాధ‌.. జ‌గ‌న్‌దైతే.. రాజ‌కీయ‌మా..?

pawankalyan-y-s-jaganmohanreddy-targets

ఏ ఏటికాడ ఆ పాటే పాడాలంటారు..! అలాగే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. ఎప్పుడు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో అలానే వ్య‌వ‌హ‌రించాలి. లేకుంటే సానుభూతి ఎక్క‌డ నుంచి వ‌స్తుంది., ఓట్లు ఎక్క‌డ నుంచి ప‌డ‌తాయి? బ‌హుశా ఈ విష‌యం గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి తెలుగు ప్ర‌పంచాన్ని ఏలేస్తాన‌ని ప్ర‌తిన బూనిన చిరంజీవి క‌న్నా కూడా ఇప్పుడు జ‌న‌సేన పార్టీతో ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ఎక్కువ‌గానే ఆకులు చ‌దివాడ‌ని అంటున్నారు.. విశ్లేషకులు. రాజ‌కీయాల‌లో ఒక సామెత చెబుతారు. సొంత పార్టీకి ముల్లు గుచ్చుకుంటే.. మేకుగాను, ప్ర‌త్య‌ర్థి పార్టీకి మేకు గుచ్చుకుంటే.. ముల్లు గానే అరిచి గోల పెట్టాల‌ని! నిజానికి ఈ విష‌యంలో టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు స‌క్సెస్ అవుతున్నారు. కానీ, ఆయ‌న‌ను మించి పోయిన త‌ర‌హాలో ఇప్పుడు ప‌వ‌న్ ఈ రాజ‌కీయ కాక‌ను బాగానే ఒంట బ‌ట్టించుకున్నారు.

తనపై హత్యాయత్నం అంటూ….

విష‌యంలోకి వెళ్తే..చంద్ర‌బాబుతో పూర్తిగా విభేదిస్తున్న పవ‌న్‌. ఇప్పుడు త‌న‌కు ఏం జ‌రిగినా,, కూడా ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై విరుచుకుపడుతున్నారు. జ‌న‌సేన నాయకుడు , మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మనోహర్‌కు భద్రత కల్పించాలని నెలక్రితం దరఖాస్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ అంటున్నారు. తమ పార్టీ నేతలకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం రాజానగరం యాత్రకు వెళ్తా ఉంటే.. ఇసుక లారీ వచ్చి… త‌న‌ కారును దాటి కాన్వాయ్‌ని గుద్దిందని. అదే రోజున హైదరాబాద్‌లో దిగి ఇంటికెళ్తుండగా నాదెండ్ల మనోహర్‌ కారును మరో ఇసుక లారీ గుద్దేసింద‌ని చెప్పారు. ఇది యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో అన్నది పోలీసులకే వదిలేశామ‌ని చెప్పిన ప‌వ‌న్‌… లోకేశ్‌ని టార్గెట్ చేశారు.. మీరు పార్టీని నడిపే వ్యక్తి. ఇలాంటి కుతంత్రాలకు పాల్పడితే ఎలా? అని ప‌వ‌న్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం గా మారింది.

అది సబబేనా?

ఇంత వ‌ర‌కు ఓకే.. ! ఎవ‌రూ ఏమీ అనరు. కానీ, త‌న‌కు అనుభ‌వ‌మైతే.. భారీ ఎత్తున స్పందించ‌డం అదే విప‌క్షానికి వైసీపీకి ఏదైనా జ‌రిగితే.. దానిని రాజ‌కీయం చేస్తున్నార‌ని అన‌డం.. ప‌వ‌న్‌కే చెల్లింది. ఎవ‌రైనా సింప‌తీ చూపిస్తారు. కానీ, ప‌వ‌న్‌లో ఆ మాత్రం సింప‌తీ కూడా పోయి.. చంద్ర‌బాబు మాదిరిగా శ‌వాల మీద కూడా రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో… గుచ్చారో… అని జగన్‌ గోల చేశారని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం ఎంత మేర‌కు స‌మంజ‌స‌మో.. ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నారు. అయితే, వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌కు ఎదురైన ఘ‌ట‌నే ప‌వ‌న్‌కు ఎదురైతే.. ప‌రిస్థితి ఎలా ఉంటుందో..? అప్పుడు కూడా చిన్న విష‌యం గానే చూస్తారా? ఇప్పుడు ఇసుక లారీల‌కే భ‌య‌ప‌డుతున్న వారు క‌త్తుల గురించి, కోడి క‌త్తుల గురించి చుల‌క‌న‌గా మాట్లాడ‌డం ఏ మేర‌కు స‌బ‌బు? అనేది తేల్చుకోవాల్సి ఉంది. అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో చూడాలి.

1 Comment on మీదైతే బాధ‌.. జ‌గ‌న్‌దైతే.. రాజ‌కీయ‌మా..?

Leave a Reply

Your email address will not be published.


*