పెద్దిరెడ్డిపై పెద్ద స్కెచ్ వేశారా?

రాజ‌కీయాల్లో ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం, బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం కామ‌న్‌.. ఎవ‌రు ఎప్పుడు నిలుస్తారో.. ఎవ‌రు ఎప్పుడు ఫ‌ట్ మంటా రో కూడా చెప్ప‌డం కష్ట‌మే. ఇప్పుడు ఇదే సీన్ చిత్తూరులో రిపీట్ అవుతోంది. చిత్తూరులోని అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా 2014లో గెలుపొందారు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ కుటుంబంతో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డిని కూడా వైసీపీలో చేర్చి.. రాజంపేట నుంచి ఎంపీగా గెలిపించు కున్నారు. కార్మికులు, క‌ర్ష‌కుల మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న పెద్దిరెడ్డి అత్యంత సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

అభివృద్ధి పనుల్లో…..

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసుకోవ‌డంలో తానే ముందుండే వ్య‌క్తిత్వం ఆయ‌న సొంతం. గ‌తంలో వైఎస్‌తో విభేదించినా.. ఇప్పుడు మాత్రం జ‌గ‌న్‌తో క‌లిసి పోతున్నారు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఎదిగిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు వైసీపీలోనూ కీల‌కంగా మారారు. అయితే, ఇప్పుడు ఆయ‌న నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షం మాదిరిగా ఆయ‌నను ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గత ఎన్నిక‌ల్లో పుంగ‌నూరు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు పెద్దిరెడ్డి. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన వెంక‌ట ర‌మ‌ణ రాజుకు 72,856 ఓట్లు రాగా, పెద్దిరెడ్డికి మాత్రం 1,04,587 ఓట్లు వ‌చ్చాయి. దాదాపు 34 వేల ఓట్ల మెజారిటీతో పెద్దిరెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు.

వరుస విజయాలతో….

చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాలు, పార్టీలు మారినా వ‌రుస విజ‌యాలు సాధిస్తూ తిరుగులేని హీరో అయ్యారు. మ‌రి ఇక్క‌డ ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? అంటే ప్ర‌శ్నార్థ‌క‌మే స‌మాధానంగా వ‌స్తోంది. ఇక్క‌డ తాగునీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దాదాపు ఐదేళ్ల కింద‌ట ప‌నులు ముగిసినా.. స‌మ్మ‌ర్ కోల్డేజ్ వాట‌ర్ ప్లాంట్ నుంచి ఒక్కగ్లాసు నీళ్లు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, ఇక్క‌డ ప్ర‌యాణికుల‌కు బ‌స్టాండ్ లేదు. అది కూడా నిర్మాణానికి నోచుకున్నా.. ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. అదేవిధంగా ఇక్క‌డ సాగునీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి ప‌నులు కూడా ల‌భించక వ‌ల‌స పోతున్నారు.

ప్రభుత్వం నుంచి సహకారం లేక…..

విప‌క్ష ఎమ్మెల్యేగా ఉండ‌డంతో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కూడా స‌రిగా అమ‌లు కావ‌డం లేదు. పైగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండ‌డంతో ఇక్క‌డ ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్లు కూడా అంద‌డం లేదు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు నిత్యం స‌మ‌స్య‌ల‌తోనే జీవిస్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగా కూడా పెద్దిరెడ్డికి ఇక్క‌డ ఇబ్బందులు తప్ప‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఇటీవ‌ల కాలంలో విలువ ఇవ్వ‌డం మానేశారని, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పెద్ది రెడ్డి పార్టీ మార‌తారని ప్ర‌చారం అయితే కొద్ది రోజుల వ‌ర‌కు జ‌రిగింది. అయితే, దీనిని ఎప్ప‌టిక‌ప్పుడు పెద్దిరెడ్డి కొట్టిపారేస్తూ వ‌స్తున్నారు.

పెద్దిరెడ్డిని ఓడించడానికి….

మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డం వంటివి ఇక్క‌డ పెద్దిరెడ్డికి స‌వాలు రువ్వుతున్నాయి. ఇక చిత్తూరు సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డంతో చంద్ర‌బాబు ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా రాజంపేట ఎంపీ సీటును టీడీపీ గెలుచుకునేలా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నారు. అలాగే పెద్దిరెడ్డిని కూడా ఓడించేందుకు కూడా పెద్ద స్కెచ్ గీసే ప‌నిలో ఆయ‌న ఉన్నారు. మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సోద‌రుడి ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకోవ‌డం వెన‌క పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టే వ్యూహ‌మే ఉంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఏదేమైనా పెద్దిరెడ్డి తండ్రి, కొడుకుల‌కు అటు అధికార ప‌క్షంతో పాటు ఇటు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ మాత్రం త‌ప్ప‌దు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*