పెద్దిరెడ్డి గెలుపు కోసం ఆయన..??

peddireddyramachandrareddy amarnadhreddy

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఆదుకుంటున్నా పెద్దిరెడ్డిని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా మంత్రి అమర్ నాధ్ రెడ్డికి దగ్గర బంధువు. అనీషారెడ్డి మాత్రమే పెద్దిరెడ్డి విజయాన్ని అడ్డుకోగలదని చంద్రబాబు విశ్వసించారు. త్వరలో విడుదల చేసే తొలి జాబితాలో సయితం అనీషా రెడ్డి పేరు ముందు వరసలో ఉంటుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే అనీషారెడ్డి నియామకం మంత్రి అమర్ నాధ్ రెడ్డికి ఇష్టం లేకుండా జరిగిందంటారు. కుటుంబంలో తాను తప్ప మరెవరూ పాలిటిక్స్ లోకి రాకూడదని అమర్ నాధ్ రెడ్డి భావిస్తున్నారు.

ఇష్టపడకపోవడంతోనే….

దీంతో అమర్ నాధ్ రెడ్డి అనీషారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇష్టపడటం లేదు. అయితే సాక్షాత్తూ అధినేత చంద్రబాబునాయుడు ఆమెను ఇన్ ఛార్జిగా ప్రకటించడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో అమర్ నాధ్ రెడ్డి ఉన్నారు. అనీషారెడ్డికి నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించిన నాటి నుంచి ఆమె వేగంగా ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీకార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. అయితే ఆమెకు టీడీపీ స్థానికనాయకత్వం సహకరించడం లేదని తెలుస్తోంది. అకస్మాత్తుగా వచ్చి తమ నెత్తిన అనీషారెడ్డిని రుద్దారని లోకల్ లీడర్లు తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు.

పెద్దిరెడ్డితో వ్యాపార సంబంధాలు….

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… మంత్రి అమర్ నాధ్ రెడ్డి కూడా అనీషారెడ్డికి సహకరించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అమర్ నాధ్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి స్నేహబంధం ఉంది. వ్యాపరా సంబంధాలు కూడా ఉన్నాయి. అమర్ నాధ్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి సాయం చేశారంటారు. దీంతో అమర్ నాధ్ రెడ్డి ఇప్పుడు లోపాయికారీగా పెద్దిరెడ్డికి సాయపడుతున్నారన్న ప్రచారం టీడీపీలో జరుగుతుంది. ఈ విషయం టీడీపీ అధినేత దృష్టికి కూడా వెళ్లడంతో ఇటీవల ఆయన అమర్ నాధ్ రెడ్డికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

బలంగా పెద్దిరెడ్డి….

మరోవైపు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగతంగా బలమైన ఓటు బ్యాంకు ఉంది. వ్యక్తిగత పరిచయాలతో పాటు అందరికీ అందుబాటులో పెద్దిరెడ్డి ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వం సహకరించకున్నా సొంత నిధులను వెచ్చించి సమస్యలను పరిష్కరిస్తున్నారు పెద్దిరెడ్డి. ఇలా పెద్దిరెడ్డి బలంగా ఉంటే పుంగనూరు టీడీపీకి పెద్దదిక్కుగా ఉంటారనుకున్న అమర్ నాధ్ రెడ్డి పెద్దిరెడ్డితో చేయికలపడంతో ఇక టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు తక్కువనే చెప్పాలి. అధికారంలో ఉండటంతో ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలు కొందరు ఎన్నికల సమయానికి పెద్దిరెడ్డి గూటికి చేరతారన్న ప్రచారమయితే ఉంది. మొత్తం మీద పుంగనూరులో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా లేవన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అనీషారెడ్డిని బలిపశువును చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 15997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*