టోల్ ఎత్తేశారు …!

ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ గేట్ ఎత్తేశారు. ఖంగారు పడొద్దు ఎక్కువ ఆనంద పడాలిసిన పనిలేదు. ఇది కేవలం రెండురోజుల పాటు ఆఫర్ మాత్రమే. గులాబీ పార్టీ లక్షలాదిమందితో లక్ష వాహనాలతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కారణంగా తీవ్ర వాహనాల రద్దీ ఏర్పడే పరిస్థితి వుంది. దాంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరే ప్రమాదం ఉందని గ్రహించిన టి సర్కార్ సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఔటర్ పై ప్రయాణించే వాహనాలకు టోల్ ఎత్తివేయించింది. ఈ రెండు రోజులకు వసూలు చేసే టోల్ రుసుము గుత్తేదారుడికి టీఆర్ఎస్ చెల్లించనుంది.

పోలీస్ చట్రంలో అవుటర్ …

ప్రగతి నివేదన సభ సక్రమంగా సాగేందుకు పక్క స్కెచ్ గీసింది టీఆర్ఎస్. తెలంగాణలోని 25 వేలమంది ఖాకీలు భద్రతా సమస్యలు, ట్రాఫిక్ తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. గులాబీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం అయిన కొంగర కలాన్ లోని ప్రగతి నివేదన సభా వేదికను ఇప్పటికే భద్రతా విభాగం స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు బ్యారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. 25 మంది ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా సభ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

కేటీఆర్ దగ్గరుండి……

డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లు ఆణువణువూ సభా ప్రాంతాన్ని పలుమార్లు జల్లెడ పట్టేశాయి. ముందు రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్ నెలకు ఒరిగింది. అయితే నిర్వాహకులు వెంటనే యుద్ధప్రాతిపదికన వరుణుడి దెబ్బకు దెబ్బతిన్న వాటిని తిరిగి ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి కేటీఆర్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. మంత్రులందరూ అక్కడే ఉండి రైతులకు భోజన సదుపాయలను చూశారు. దగ్గరుండి వడ్డించారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*