రజనీ జోరుకు బ్రేకులు వేసేదెలా….?

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో త‌న హ‌వా ప్ర‌ద‌ర్శిస్తున్న మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప్ర‌త్తిపాటి పుల్లారావుకు ఇప్పు డు అదే నియోజ‌క‌వ‌ర్గంలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌క‌లు. అది కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఓ మ‌హిళా నేత కార‌ణంగానే పుల్లారావుకు ఓట‌మి కూడా ఎద‌ుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. చిల‌క‌లూరి పేటలో సింగిల్ హ్యాండ్‌తో అధికారం చ‌లాయించాల‌ని భావించారు ప్ర‌త్తిపాటి. అయితే, అనూహ్యంగా విడ‌ద‌ల ర‌జ‌నీ అరంగేట్రంతో ఆయ‌న రాజ‌కీయ జోరుకు బ్రేకులు ప‌డ్డాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో ఆమెతో ఢీ అంటే ఢీ అనేందుకు సైతం పుల్లారావు రెడీ అవుతున్నారు.

అగ్గిమీద గుగ్గిలం……

నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి విష‌యంలోనూ వేలు పెట్ట‌డం ప్ర‌త్తిపాటికి అల‌వాటైంది. ఆయ‌న ఏప‌నిలోనైనా త‌న ప‌నిత‌నం చూపించాల్సిందే. అయితే, తాజాగా వైసీపీ నుంచి మ‌హిళా నేత ర‌జ‌నీ తెర‌మీదికి రావ‌డం, ఆమె దూసుకుపోతుండడంతో ప్ర‌త్తిపాటి ఓర్చుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌కు చెందిన ఓ సంస్థ చిల‌క‌లూరిపేటలో న‌గ‌ల దుకాణం ఏర్పాటు చేసి, ర‌జ‌నీని ప్రారంభించాల‌ని కోరారు. దీనికి అంగీక‌రించిన ఆమె స‌ద‌రు దుకాణానికి వెళ్లి దీపం వెలిగించి షాపును ప్రారంభించారు. అయితే, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తెలియ‌కుండా షాపు ప్రారంభించ‌డం, అదికూడా త‌నకు రాజకీయ ప్ర‌త్య‌ర్థి అయిన ర‌జ‌నీతో ప్రారంభించ‌డంపై మంత్రి పుల్లారావు అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండి ప‌డ్డార‌ట‌.

దుకాణంపై దాడులు చేసి……

వెంట‌నే ఏం జ‌రిగిందో ఏమో గాని స‌ద‌రు కొత్త దుకాణంపై క‌క్ష సాధించారు. తూనిక‌లు కొల‌త‌ల శాఖ అధికారుల‌ను పంపి.. తూకాల‌ను టెస్ట్ చేసి కేసులు న‌మోదు చేయించారు. ఈ ప‌రిణామం నిజంగా జిల్లాలోనే ప్ర‌ధాన చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌త్తిపాటి పుల్లారావు ప‌ని అయిపోయింద‌ని, అందుకే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా మార్పు ను కోరుకుంటున్నార ని అంటున్నారు . ఈ క్ర‌మంలోనే ప్ర‌త్తిపాటిని కాద‌ని, ర‌జ‌నీకి ర‌థం ప‌ట్టేందుకు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు.

మర్రి రాజశేఖర్ కూడా……

ఇక‌, ప్ర‌త్తిపాటి ఆయ‌న దూకుడును, ఆయ‌న ఫ్యామిలీ దూకుడు రాజ‌కీయాల‌తో ముందుకు వెళితే స‌క్సెస్ అయ్యే ప‌రిస్థితి లేదంటున్నారు. మర్రి రాజశేఖర్ పార్టీలో తిరుగుబాటు చేస్తే తనకు కలసి వస్తుందని ప్రత్తిపాటి ఆశించారు. అయితే మర్రి రాజశేఖర్ ను పార్టీ హామీ ఇచ్చి మరీ ఒప్పించిందంటున్నారు. దీంతో విడదల రజనీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ మ‌హిళా లీడ‌ర్‌గా రోజు రోజుకు గ్రాఫ్ పెంచుకుంటూ పోతోన్న ర‌జ‌నీ జోరుకు ఎలా బ్రేకులు వేయాలా ? అని ప్ర‌త్తిపాటి త‌ల‌ప‌ట్టుకుంటున్న‌ట్టు కూడా చిల‌క‌లూరిపేట పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*