ర‌ఘువీరా జోస్యం ఫ‌లిస్తే.. ..?

అవును! ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎన్. ర‌ఘువీరారెడ్డి చెప్పిన మాట నిజ‌మ‌వుతుందా? అదే జ‌రిగితే.. రాష్ట్రంలో ఆయ‌న నేతృ త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ‌తేంటి? ఇప్పుడు ఇదే చ‌ర్చ అన్ని రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల ర‌ఘువీరా మీడియాతో మ‌ట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో త్రిశంకు సభ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించేది కాంగ్రెసేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తామని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలుగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో కార్యకర్తలకు శిక్షణ తరగతులు జరుగుతున్నా యని, వచ్చే నెల 15 నుంచి బూత్‌లెవల్‌ కమిటీ సభ్యులకు శిక్షణ ఇస్తున్న‌ట్టు చెప్పారు.

హంగ్ ఏర్పడితే….

అంతాబాగానే ఉంది. అయితే, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అంశం ఆయ‌న నోటి నుంచి రావ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. వాస్త‌వానికి తాను చేప‌డుతున్న ప‌థ‌కాలు, తాను చేస్తున్న క‌ష్టంతో రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 145 క‌నీసం త‌న ఖాతాలో ప‌డ‌తాయ‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ అధినేత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌ని, రాజ‌న్న రాజ్యం స్థాపించ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న వెల్ల‌డిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఇంత‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఎన్నిక‌ల రంగ ప్ర‌వేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కూడా మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు.

వ్యతిరేక ఓటు….?

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం ఊపందుకుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఎటు చీలుతుంది? అనేది ప‌క్క‌న పెడితే.. ఎవ‌రికి వారు త‌మ త‌మ పంథాల్లో ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌క‌ర్గాల్లోనూ.. పోటీ హోరా హోరీగా ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య మాత్ర‌మే సాగిన పోరు.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య సాగ‌నుంది. దీంతో త్రిముఖ పోరు రాష్ట్రంలో సాగ‌డం ఖాయం. అయితే, గెలుపున‌కు అవ‌స‌రమైన 89 స్థానాల‌ను ఏ పార్టీ కైవ‌సం చేసుకుంటుంద‌నేది చ‌ర్చ‌కు దారితీస్తున్న అంశం. గ‌తంలో జ‌గ‌న్‌కు 67 స్థానాల్లో అవ‌కాశం ల‌భించింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సంఖ్య ఎంత వ‌ర‌కు పెరుగుతుంది. వైసీపీకి వ‌చ్చే సీట్లు ఎలా ఉంటాయి అన్న‌ది అప్పుడే అంచ‌నాకు రాని ప‌రిస్థితి.

ఎవరి లెక్కలు వారివేనా?

ఇక‌, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌.. ఎమ్మెల్యేల దందాల నేప‌థ్యంలో అధికార పార్టీ అత్తెస‌రు మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని కొంద‌రు చెపుతుంటే మ‌రి కొంద‌రు మాత్రం కేవ‌లం.. 65 నుంచి 70 స్థానాల‌కే ప‌రిమిత‌మ వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘువీరా రెడ్డి రాష్ట్రంలో త్రిశంకు స‌భ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పి ఉంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. రాష్ట్రంలో ఏ పార్టీకీ పూర్తిస్థాయిమెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదా ? అన్న దానిపై ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా కొంద‌రు ఎవ్వ‌రికి మెజార్టీ రాద‌ని.. మ‌రికొంద‌రు ఎవ్వ‌రికి పూర్తి మెజార్టీ రాద‌ని లెక్క‌ల్లో ఉన్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఇక్క‌డే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నార‌నేది పైకి క‌నిపిస్తున్న విష‌యం. కానీ, లోతుగా విశ్లేషిస్తే.. ఇవి కొంద‌రికే ప‌రిమిత‌మ‌వుతున్నాయ‌ని, పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఇవి కొన‌సాగుతున్నాయ‌నేది వాస్త‌వం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*