లవర్ మూవీ రివ్యూ

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: రాజ్ తరుణ్, రిద్ది కుమార్, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, సచిన్ కెద్కర్, అజయ్, రోహిణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: జామ్ 8
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ప్రొడ్యూసర్: దిల్ రాజు
డైరెక్టర్: అనీష్ కృష్ణ

రెండేళ్ల క్రితం వరకు రాజ్ తరుణ్ సినిమా వస్తుంది అంటే… ఆ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉండేది. కొత్త కుర్రాడు.. మంచి సినిమాలు చేస్తాడనే పేరుంది. కానీ గత రెండేళ్లుగా రాజ్ తరుణ్ ఏది పట్టుకుంటే అది మసి అవుతుంది. వరుస ప్లాప్స్ రాజ్ తరుణ్ ని కుంగ దీస్తున్నాయి. ఈ ఏడాదే చూడండి రంగులరాట్నం, రాజుగాడు సినిమాలు రెండు అట్టర్ ప్లాప్స్ అయ్యాయి. రాజ్ తరుణ్ క్రేజ్, అతనిలోని నటుడు ఈ సినిమాలను కాపాడలేకపోయాయి. దెబ్బకి రాజ్ తరుణ్ మర్కెట్ కూడా పడిపోయింది. మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో నుండి అస్సలు అంచనాలు లేని హీరోగా ప్రస్తుతం రాజ్ తరుణ్ ఉన్నాడు. తన టాలెంట్ ని నమ్ముకుని హీరో అయిన రాజ్ తరుణ్ ఆలోచన లేకుండా చేస్తున్న తప్పులే అతను ఈ పరిస్థితుల్లో నిలబడడానికి కారణం. ఇక అన్నపూర్ణ బ్యానర్ వంటి పెద్ద సంస్థ లో చేసిన రంగుల రాట్నం ప్లాప్ అవడంతో.. రాజుగాడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కనుమరుగైపోవడంతో.. ఈసారి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజుని నమ్ముకుని లవర్ సినిమాని అలా ఎలా ఫెమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక కొత్త హీరోయిన్ తో కలిసి నటించాడు రాజ్ తరుణ్. దర్శకుడు అనీష్ కృష్ణ అలా ఎలా సినిమాని చాలా లో బడ్జెట్ లో తెరకెక్కించినప్పటికీ.. సినిమాలో కామెడీ పుష్కలంగా ఉండడంతో ఆ సినిమా ఒకమాదిరిగా పర్వాలేదనిపించింది. ఆయితే అప్పట్లో అనీష్ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ లేకపోవడంతో… అసలా సినిమా వచ్చిన విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. మరి అలాంటి దర్శకుడితో దిల్ రాజుని నమ్మి రాజ్ తరుణ్ ఈ లవర్ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు కాస్త ఆలోచించి ప్రమోట్ చేసినట్లుగా అనిపించింది. ఎందుకో ఏమో దిల్ రాజు కి కూడా ఈ సినిమా మీద నమ్మకం లేదా.. లేదా ప్రమోషన్స్ ఎందుకు హిట్ అయ్యే సినిమాకి అనుకున్నాడో తెలియదు కానీ.. ఈ సినిమాని మాత్రం పెద్దగా ప్రమోట్ అయితే చెయ్యలేదు. ఇక రాజ్ తరుణ్ దిల్ రాజు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెట్టిందో సమీక్షలో చూసేద్దాం.

కథ:
రాజ్(రాజ్ తరుణ్) ఒక అనాధ. అనాధ అయిన రాజ్ జగ్గు(రాజీవ్ కనకాల)నే తన సొంత అన్నయ్య మాదిరి భావిస్తూ ఉంటాడు. ఇక రాజ్ మాత్రం కస్టమర్లు కోరినట్టుగా బైకులు తయారు చేసే బైక్ బిల్డర్. రాజ్ అన్నయ్యలా భావించే జగ్గు ఒక క్రిమినల్. జగ్గు.. సంపత్(సుబ్బా రాజు)దగ్గర పనిచేస్తుంటాడు. అయితే ఒక యాక్సిడెంట్ తో హాస్పిటల్ కి వచ్చిన రాజ్.. అక్కడ ఆ హాస్పిటల్ లో పనిచేసే నర్స్ చరిత(రిద్ది కుమార్) తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే చరిత ఒక అమ్మాయికి హెల్ప్ చేసే విషయంలో పెద్ద ప్రమాదంలో పడుతుంది చరిత నర్స్ గా పనిచేసే హాస్పిటల్ లో ఒక పెద్ద స్కాం జరుగుతుంది. ఆ స్కామ్ విషయంలో రాజ్ అన్నగా భావించే జగ్గు… చరితకు రాజ్ లకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది. మరి అన్నగా భావించే జగ్గు రాజ్ కి వ్యతిరేఖంగా ఎలా మారాడు? చరిత ఆ అమ్మాయి వలన ఎలాంటి ప్రమాదంలో పడింది? ఈ సమస్యల నుండి చరిత, రాజ్ ఎలా గట్టెక్కారు? అనేదే మిగతా కథ.

నటీనటుల నటన:
రాజ్ తరుణ్ ఎప్పటిలాగే ఎనర్జీ నిండిన నటననే కనబరిచాడు. అనాధగా.. బైక్ బిల్డర్ గా రాజ్ తరుణ్ లుక్స్ అన్ని ఓకె. కాకపోతే రాజ్ తరుణ్ ఇదివరకటి లాగే… కొన్ని విషయాల్లో ఓవరేక్షన్ చేసినట్లుగా అనిపిస్తుంది. మామూలుగానే మనోడికి కాస్త అతి ఎక్కువ. ఆ అతి కాస్తా ఇందులో మరింత ఎక్కువైంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే హీరో నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో రాయలసీమ భాషా ట్రై చేసి సక్సెస్ అయ్యేసరికి… ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో దర్శకుడు చిత్తూరు భాషను పలికించాడు. అక్కడా తేడా కొట్టింది. ఇక జుట్టుని పిలకేసుకుని.. ఆకట్టుకున్న రాజ్ తరుణ్ తన పాత్ర విషయంలో మరింత శ్రద్ద పెడితే బావుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాప్స్ లో ఉన్న హీరో విషయంలో అన్ని మైనస్ గానే కనబడతాయి. ఇక హీరోయిన్ రిద్ది కుమార్ క్యూట్ లుక్ లో లేకపోయినా.. ఉన్నంతలో మెప్పించింది. గ్లామర్ పరంగాను, నటన పరంగాను ఈ అమ్మాయి కాస్త వీక్ అనిపిస్తుంది. ఇక రాజీవ్ కనకాల జగ్గు పాత్రలో డిఫ్రెంట్ గా అనిపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు సాఫ్ట్ కేరెక్టర్స్ చేసి ఇలా నెగెటివ్ షేడ్స్ లో పెద్దగా చెయ్యలేదు. ఇక సుబ్బరాజు, రోహిణి ఎవరి అపరిమితుల్లో వారు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
రొటీన్ కథలతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ప్రయోగాలు చేసే దర్శకులను… స్టార్ హీరోలు సైతం ప్రోత్సహిస్తున్నారు. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులు ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని వినూత్నమైన కథలను ఎంచుకుంటున్నారు. అందుకే ప్రతి శుక్రవారం ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ శుక్రవారం కూడా అలా ఎలా ఫెమ్ దర్శకుడు అనీష్ కృష్ణ తన మొదటి సినిమా అలా ఎలా తో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఎలా సినిమా హిట్ కాకపోయినా.. కామెడీ ఎంటెర్టైనెర్ గా ఆ సినిమా బావుంటుంది. మరి ఆ సినిమా వచ్చిన మళ్ళీ చాన్నాళ్ళకి ఇప్పుడు దిల్ రాజు వంటి బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దర్శకుడు లవర్ సినిమా కథను మలిచిన విధానం చాలా పాతగా… రొటీన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సాగే లవ్ ట్రాక్ గతంలో అనేక సినిమాల్లో వచ్చేసిన స్టోరీనే… ఆసుపత్రుల్లో సాగే బ్లడ్ మాఫియా అనే పాయింట్ ని లవ్ స్టోరీకి కనెక్ట్ చేయటం బాగానే ఉంది కానీ… దాన్ని కన్విన్సింగ్ గా చూపడంలో అనీష్ కృష్ణ మాత్రం నూటికి నూరు శాతం ఫెయిల్ అయ్యాడు. కుర్ర హీరోల్లో రాజ్ తరుణ్ కి ఒకప్పుడున్న క్రేజ్ ప్రస్తుతం లేదు. రాజ్ తరుణ్ మర్కెట్ పడిపోవడం… అసలు క్రేజ్ లేని రాజ్ తరుణ్ కి ఈ సినిమా హిట్ ఎమన్నా హెల్ప్ అవుతుంది అంటే… మళ్ళీ రొటీన్ రోడ్డ కొట్టుడులో లవర్ కూడా కొట్టుకుపోయింది. ఇక రాజ్ తరుణ్ యాటిట్యూడ్ కి లవర్ సినిమా చెక్ పెట్టినా బావుండు అనిపిస్తుంది.. సినిమా చూస్తున్నంత సేపు. మరి ఫస్ట్ హాఫ్ కాకపోతే.. కనీసం సెకండ్ హాఫ్ లో ఏదన్నా ట్విస్టులు గాని, సస్పెన్సు సీన్స్ కానీ ఉంటాయేమో అనుకుని సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడికి ఆసాంతం లవర్ ఎక్కడా ఆకట్టుకోలేపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే రాజ్ తరుణ్ మరో ప్లాప్ కి చేరువయ్యాడు. మరి ఇలా ప్లాప్స్ మీద ప్లాప్స్ కొడుతూ హ్యటిక్ ప్లాప్ హీరోగా రాజ్ తరుణ్ మారినా మారొచ్చు.

సాంకేతిక వర్గం పనితీరు:
లవర్ సినిమాకి ఎదో ఒక ప్లస్ ఉంది అంటే.. కపుల్ ఆఫ్ సాంగ్స్ మాత్రమే. పాటలు చిత్రీకరించిన విధానం ఎవర్ గ్రీన్ గా నిలిచే సీన్ లేదు కానీ…. చాలామటుకు ఇవే సినిమాని కొంత కాపాడాయి అని చెప్పొచ్చు. కానీ నేపధ్య సంగీతానికి వచ్చేసరికి జామ్ చాలా నీరసపడ్డాడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అస్సలు రుచించేలా లేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా లవర్ కున్న మెయిన్ ప్లస్ పాయింట్. అవుట్ ఫుట్ లో కెమెరా వర్క్ బాగా పనికివచ్చింది. కేరళ అందాలుతో ఇలాంటి సినిమాకు కావాల్సిన విజువల్స్ ని చక్కగా సెట్ చేసుకున్నాడు. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా చోట్ల కత్తెరకు పని చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కత్తెర వేయాల్సింది… అది చెయ్యకుండా సినిమా బోర్ కొట్టడానికి అవకాశం ఇచ్చింది. ఇక నిర్మాణ విలువల్లో దిల్ రాజు ఎప్పటిలాగే ఎక్కడా రాజి పడినట్లుగా అనిపించదు. ప్రతి ఫ్రెమ్ రిచ్ గానే ఉంది.

ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ, కొన్ని పాటలు, మ్యూజిక్, హీరోయిన్ రిద్ది లుక్స్
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, లాగింగ్ సీన్స్, ఎడిటింగ్

రేటింగ్: 2.0/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*