తటస్థులు ఎటు వైపు?

narenndramodi vsmamathabenerjee rally

మరికాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్, ఎన్డీఏ తరుపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీకి దింపింది. రెండు పక్షాలూ బలం తమకే ఉన్నాయని చెబుతున్నారు. అయితే తటస్థ పార్టీలు ఎవరికి మద్దతిస్తే వారినే విజయం వరిస్తుంది. టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే పార్టీల మద్దతు వల్లనే ఎవరికైనా విజయం సాధ్యమవుతుంది.

మూడు పార్టీల మద్దతు……

అయితే ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో ఫోన్లో మాట్లాడి మద్దతు కోరారు. నవీన్ పట్నాయక్ బీజేపీ తరుపున కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తే మద్దతిస్తామని స్పష్టమైన హామీ నితీష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కేసీఆర్ కూడా జేడీయూ అభ్యర్థికే జై కొడతారని చెబుతున్నారు. అన్నాడీఎంకే ఎటూ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంది కాబట్టి ఇది కూడా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు తెలుపనున్నారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిత్రపక్షాలైన శివసేన, అకాళీదళ్ కూడా అసంతృప్తి నుంచి బయటపడి మద్దతును ప్రకటించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*