ఒక్క ఛాన్స్ .. ఇక రానట్లేగా….??

ravela-kishore-babu-janasenaparty

రావెల కిశోర్ బాబు… ఐఆర్ఎస్ అధికారిగా ఉండి.. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించిన రావెల కిశోర్ బాబు అనూహ్యంగా మొదటి సారి గెలిచి మంత్రి పదవినీ చేపట్టారు. ఆయనకు అనుకోకుండా అన్నీ వరాలుగా వచ్చిపడ్డాయి. ఆయనను చూసి అసూయ పడిన వాళ్లు అప్పట్లో అనేక మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు సయితం మంత్రి పదవి ఎంత సులువుగా కొట్టేశారంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటి రావెల కిశోర్ బాబు రాజకీయ చరిత్ర ఒక్కసారితోనే ముగిసిపోతుందా? ఆయన ఒక్క సారి ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా? అన్నది చర్చనీయాంశమయింది.

రెండున్నరేళ్ల పాటు…

రావెల కిశోర్ బాబు దాదాపు రెండున్నరేళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఉన్నతాధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన రావెల కిశోర్ బాబుకు మొదటిసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ లభించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసితొలిసారి గెలిచిన రావెల కిశోర్ బాబుకు ఎవరి అంచనాలకు అందని విధంగా చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది. అయితే ఆయన ఫక్తురాజకీయనేత కాకపోవడం, ఉన్నతాధికారి వ్యవహార శైలి వీడక పోవడంతో తలనొప్పులుతయారయ్యాయి.

బలమైన సామాజికవర్గంతో….

రావెల తన సొంత నియోజకవర్గంలోని బలమైన సామాజికవర్గం నేతలతోనే విభేదాలు కొని తెచ్చి పెట్టుకున్నారు. ప్రత్తిపాడు రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో అక్కడ ఆ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. కానీ రావెల ఉన్నత చదువులు చదివి ఉండటం, ఉన్నతాధికారిగా పనిచేయడంతో వారి ఆధిపత్యానికి తెరదించారు. వారి మాటలను లెక్కచేయలేదు. దీంతో రావెల పై అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులందాయి.మరోవైపు మందకృష్ణ మాదిగ తో స్నేహమూ రావెల కొంపముంచింది. మొత్తం మీద మంత్రి పదవి ఊడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు.

గెలిచే అవకాశాలు…

అయితే జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి మరోసారి బరిలోకి దిగిన రావెల కిశోర్ బాబు గెలిచే ఛాన్సులు అస్సలు లేవంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత బలంగా ఉన్నారు.రావెలకు కాపు సామాజిక వర్గం, దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్నా అది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. దీంతో రావెల గెలవడం అనేది కష్టమేనని తెలిసిపోయింది. ఆయన తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని బాగా ప్రయత్నించినా, అక్కడ నుంచి టిక్కెట్ హామీ రాకపోవడంతో జనసేనలో చేరారు. మొత్తం మీద రాజకీయంగా రావెల జీవితం ఒక్కసారికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి రావెల తర్వాత స్టెప్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఆయన అనుచరుల్లో నెలకొని ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 18022 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*