రాయపాటిపై చంద్రబాబు ఈక్వేషన్‌ ఏంటి..?

తెలుగు రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న రాయపాటి ఫ్యామిలీ నుంచి 2019 ఎన్నికల్లో సరికొత్త రాజకీయం మొదలవుతోంది. నాలుగున్నర దశాబ్దాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తు వస్తున్న సీనియర్‌ పార్లమెంటేరియ‌న్ రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో రిటైర్‌ అవుతారా లేదా ? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాయపాటి వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే ఛాన్సులే ఎక్కువ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఐదు సార్లు లోక్‌స‌భ‌కు, ఒక సారి రాజ్యసభకు ఎన్నికై సుదీర్ఘ‌ కాలం పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించిన ఆయన ఇప్పటికే వయో భారంతో ఉన్నారు. ఈ వయస్సులోనూ యాక్టివ్‌గా ఉన్నా వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసులకు చోటు ఇచ్చే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నరసరావు పేట ఎంపీగా…..

గతంలో గుంటూరు నుంచి వరసగా ఎంపీగా విజయాలు సాధించిన ఆయన 2004, 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్‌ చేసి నరసారావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక రాయపాటి వారసుడు రాయ‌పాటి రంగారావు విషయానికి వస్తే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకుడిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యక్రమాల్లోనూ, జిల్లా కార్యక్రమాల్లోనూ తనకు అప్పగించిన బాధ్యత విజయవంతంగా నిర్వర్తిస్తున్న రంగారావు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న మీడియా ముఖంగా సైతం ప్ర‌స్తావిస్తున్నారు.

ఏ ఆప్షన్ ఇస్తారో…?

రాయపాటి రంగారావుకి చంద్రబాబు ఏ ఆప్షన్‌ ఇస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి అయితే సస్పెన్స్‌గానే ఉంది. తన తండ్రి త‌ప్పుకునే నరసారావుపేట సీటును రంగారావుకి ఇస్తారా లేదా జిల్లాల్లోని ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఆయన్ను బరిలోకి దింపుతారా అన్నది చూడాల్సి ఉంది. రాయపాటి నరసారావుపేట ఎంపీ సీటును వదులుకుంటే అక్కడ నుంచి పోటీ చేసేందుకు పార్టీకి చెందిన కోందరు సీనియర్‌ నాయకుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఓ మంత్రి పేరు సైతం అక్కడ నుంచి ఎంపీ రేసులో వినిపిస్తోంది. అలాగే జిల్లాకే చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం ఈ సీటు నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

మూడు నియోజకవర్గాల్లో….

నరసారావుపేట సీటును రాయపాటి ఫ్యామిలీకి కేటాయించ‌ని పక్షంలో ఆయన తనయుడికి మాత్రం ఖ‌చ్చితంగా జిల్లాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు రాయపాటి దక్కించుకుంటాడు అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం జిల్లాల్లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి రంగారావు పేరు వినబడుతోంది. పార్టీ నుంచి ఓ సీనియర్‌ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు గుంటూరు వెస్ట్‌ సీటుతో పాటు పార్టీ గత ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్న మరో సీటు నుంచి కూడా రంగారావు పేరు పార్టీ అధిష్టానం వద్ద ప్రాప‌బుల్స్‌లో ఉంది. రాయపాటి ఫ్యామిలీకి సీటు ఖాయమే. రాయపాటి పోటీ చెయ్యని పక్షంలో ఆయన తన తనయుడికి సీటు గ్యారెంటీగా ఇప్పించుకుంటారు. అయితే వారసుడి ఎంట్రీ లోక్‌సభ బరిలో ఉంటుందా ? అసెంబ్లీ నుంచి ఉంటుందా అన్నది మాత్రమే చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*