రేవంత్ ఇలాకాలో గులాబీ వికసిస్తుందా…?

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంపై కన్నేసింది గులాబీ దండు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ జండా ఎగురవేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కి గట్టి షాక్ ఇవ్వాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటినుంచి ఎత్తులు పై ఎత్తులు వేయాలని కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ ఆపరేషన్ కి హరీష్ రావు ను ఇన్ ఛార్జి గా పెట్టింది. హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ని హరీష్ కి జత చేసింది. ఇక వారిద్దరూ అక్కడ రేవంత్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేసేందుకు రంగంలోకి దిగిపోయారు. అందుకు అవసరమైన పనులు ప్రారంభించారు.

రేవంత్ ఎదురుదాడికి సిద్ధం …

కాంగ్రెస్ ఫైర్ గన్ రేవంత్ టీఆరెస్ వ్యూహాన్ని పసిగట్టి జాగ్రత్త పడుతున్నారు. ముందే వారికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేయాలన్న ఎత్తుగడతో తన సేనలతో సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన కొడంగల్ బస్సు స్టాండ్ శంకుస్థాపన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్ట్టించింది. హరీష్ నేతృత్వంలో ఇక్కడ అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రేవంత్ వర్గం ర్యాలీగా బయల్దేరింది. వారి ర్యాలీని రొటీన్ గానే అడ్డుకున్నారు పోలీసులు. ఘర్షణ తలెత్తడంతో లాఠీ ఛార్జ్ సైతం చేసేసారు.

రేవంత్ కి సవాల్ విసిరిన హరీష్ …

ఇక టీఆర్ఎస్ సభ మాత్రం దిగ్విజయం అయ్యింది. భారీ జనసమీకరణ నడుమ సభ నిర్వహించి రేవంత్ కి అక్కడినుంచే హరీష్, నాయిని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ పార్టీ గెలిచి తీరుతుందని యుద్ధానినాదం చేసొచ్చారు. యధావిధిగా రేవంత్ సైతం టి పార్టీ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వారి సభకు అనుమతి ఇచ్చి తనకెందుకు ఇవ్వలేదంటూ గర్జించారు. ఇంకా ఎన్నికలు రాకుండానే ఈ తరహా వాతావరణం ముందే రావడంతో రాబోయే రోజుల్లో ప్రధాన పార్టీల పోరాటం నేతల తీరు మరింత ఆసక్తికరంగా మారె అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*