రోజా విషయంలో ప్రాబ్లమే మరి…!

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు చెక్ పెట్ట‌డం సాధ్య‌మేనా? ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆమెకు అడ్డుక‌ట్ట వేయ‌గల మా? ఇప్పుడు ఇదే విష‌యం టీడీపీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న‌నేప‌థ్యంలో రోజా ను ఎలా ఎదుర్కొనాలి. ఇప్ప‌టికే ఆమె అసెంబ్లీకి వ‌స్తే.. టీడీపీ నాయ‌కులు తత్త‌ర‌ప‌డుతున్న ప‌రిస్తితి ఉంది. ఈ నే ప థ్యం లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెడితేఎలా? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లుటీడీపీని ఆలోచ‌న‌కు దారితీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏకంగా ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో నూ రోజాను అసెంబ్లీలోకి రానీయ‌కుండా చేయాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. అయితే, ఇది ఎలా సాధ్యం? అనేది టీడీపీ ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌, ప్ర‌శ్న‌కూడా!

వదలిపెట్టకుండా వెంటపడుతూ…..

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాదించారు రోజా. గ‌తంలో టీడీపీతోనే రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. ఆమె చ‌ట్ట‌సభ‌లోకి అడుగు పెట్ట‌లేక పోయారు. త‌ర్వాత వైఎస్‌ను ఆశ్ర‌యించే స‌రికి ఆయన మ‌ర‌ణించ‌డంతో ఆగిపోయారు. త‌ర్వాత ఆయ‌న కుమారుడు వైసీపీని స్థాపించ‌డంతో దానిలో చేరి టికెట్ సంపాయిం చుకున్న రోజా.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ సీనియ‌ర్ దివంగ‌త గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడుపై విజ‌యం సాధించారు. అయితే, స‌భలోకి అడుగు పెడుతూనే ఆమె చంద్ర‌బాబు స‌హా మ‌హిళా టీడీపీ ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో ఆమె తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. దీంతో ఆమె ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ కూడా అయ్యారు.

గాలి వారసుల్లో ఒకరికి….

అయినా ఆమె వెనుదిర‌గ‌లేదు. ప్ర‌భుత్వంపై క‌త్తిలాంటి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేకు చెక్ పెట్టే అవ‌కాశం టీడీపీకి లభించింది. న‌గ‌రి నుంచి ప‌టిష్ట‌మైన వ్య‌క్తిగా రోజా మ‌రోసారి బ‌రిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆమెను అడ్డుకోవ‌డం ఎలా అనే విషయంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. గాలి ముద్దుకృష్ణ‌మ వార‌సుల్లో ఒక‌రికి టికెట్ ఇవ్వ‌డం ద్వారా చెక్ పెట్టాల‌ని అనుకుంటున్నారు. అయితే, ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కూడా ఈ టికెట్‌కు పోటీ ప‌డుతుండ‌డంతో బాబుకు ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న ఈ ర‌గ‌డ‌ను స‌ర్ది పుచ్చారు. అయితే, టికెట్ ఈయ‌న కుమారుల్లో భానుప్ర‌కాశ్‌కు ఇచ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.

రోజాకే ఛాన్సెస్ అని…..

అయితే, రోజా కూడా తిరిగి త‌ను గెలుపొందేందుకు అవ‌స‌ర‌మైన అన్ని మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంలోనే ఇటీవ‌ల ఆమె సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నారు. పైగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విప‌క్షంలో ఉండి కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు సార్లు జాబ్ మేళాలు నిర్వ‌హించి స్థానిక యువ‌త‌కు ఉపాది చూపించారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆమెకు సానుకూల ప‌వ‌నాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. దీంతో టీడీపీ ఆమెను ఓడించ‌డం సాధ్య‌మా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*