వైసీపీలో ఎమ్మెల్యే అభ్య‌ర్థికి వేట‌…!

searching for mla candidate in ysr congress party

వైసీపీకి ఎమ్మెల్యే అభ్య‌ర్థికావ‌లెను! అదేంటి? అని ఆశ్చ‌ర్య ప‌డుతున్నారా. అదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డు స్తోంది. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ప్ర‌తి పార్టీ కూడా ఏ ఒక్క సీటును కూడా వ‌దులుకునేం దుకు వెనుకాడ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నిభావిస్తున్న మూడు పార్టీలూ ప్ర‌తి సీటును ప్ర‌తి ఓటును ప్రాణ ప్ర‌దంగా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తి టికెట్‌ను ఆచితూచి ఇస్తున్నాయి. అభ్య‌ర్థి గెలుస్తాడ‌ని అనుకుంటేనే నాయ‌కులు టికెట్లు కేటాయిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఆర్థికంగాను బ‌లంగా ఉన్నాడా? లేడా? అనే విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటున్నారు.

ఆళ్లను మారుస్తారా?

ఇలాంటి విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ముందుకు అడుగులు వేస్తోంది. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏమాత్రం తేడా వ‌చ్చినా అభ్య‌ర్థులు ఎలాంటి వారినైనా కూడా జ‌గ‌న్ ప‌క్క‌న పెడుతున్నారు. ఈ తర‌హా ప‌రిస్థితి మ‌న‌కు ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో క‌నిపించింది. ముఖ్యంగా గుంటూరులోనూ జ‌గ‌న్ అనేక మార్పులు ఇప్ప టికే చేశారు. దీంతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు మారిపోయారు. ఇప్పుడు త‌న‌కు ఎంతో ప్రియ‌మిత్రుడు, పార్టీ త‌ర‌ఫున పోరాటాలు చేస్తున్న నాయ‌కుడు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని కూడా మార్చాల‌ని నిర్ణ‌యిం చిన‌ట్టు జ‌గ‌న్ ద‌గ్గ‌ర అత్యంత చ‌నువు ఉన్న నాయ‌కులు చెబుతున్న విష‌యం.

బాగా పోరాడినా….

ప్ర‌భుత్వంపై పోరాడుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో మాత్రం ప‌ట్టు సాధించ‌డంలో ఆళ్ల వెనుక‌బ‌డి పోయార‌నే పేరు తెచ్చుకు న్నారు. రైతుల ప‌క్షాన ఆయ‌న చేసిన పోరు నిజంగానే అద్భుతం. అదే విధంగా స‌దావ‌ర్తి భూముల విష‌యంలోనూ ఆయ‌న బాగానే పోరాడారు. అయితే, ఆయ‌న చేసిన న్యాయ‌పోరాటాలు అన్నీ కూడా ఒక ఎత్త‌యితే.. ఆయ‌న ప్ర‌జ‌ల్లో తిర‌గ‌క‌పోవ‌డం మైన‌స్‌గా మారిపోయింది. ఇక‌, ఆర్థికంగా కూడా ఆయ‌న ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఈ ప‌ర్య‌వ‌సానాల నేప‌థ్యంలో ఇక్క‌డ కొత్తగా ఎవ‌రైనా ఉంటే మంచిద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

బీసీ సామాజిక వర్గం నుంచి….

ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా బ‌లంగా ఉండే ఎన్నారైని వెతికి ప‌ట్టుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే మంగ‌ళ‌గిరి సీటు కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌ధాన పార్టీలు ఎక్కువుగా బీసీల్లో ఓ సామాజిక‌వ‌ర్గానికే కేటాయిస్తూ వ‌స్తున్నాయి. ఇప్పుడు టీడీపీ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే సామాజిక‌వ‌ర్గానికి కేటాయించే సూచ‌న‌లు ఇప్ప‌టికే వెలువడుతుండ‌డంతో జ‌గ‌న్ కూడా అదే సామాజిక‌వ‌ర్గం నుంచి ఓ వ్య‌క్తిని ఇక్క‌డ పోటీకి పెడుతున్నార‌ని.. ఈ క్ర‌మంలోనూ ఇక్క‌డ ఆర్కేను త‌ప్పిస్తున్న‌ట్టు మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఆర్కేకు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌ ఎమ్మెల్సీ ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలిసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*