శర్మ వెనక మర్మమిదేనా..?

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ బుట్టలో పడకుండా కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఎమ్మెల్యేలను ఉంచినా తర్వాత అక్కడ అంత సేఫ్ కాదని భావించి ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి అత్యవసరంగా హైదరాబాద్ కు తరలించారు. అయితే, ఎమ్మెల్యేలను తరలించేందుకు ఈ పార్టీలు శర్మ ట్రెవెల్స్ బస్సులను ఉపయోగించారు. అయితే, ఎమ్మెల్యేలను భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్న వీరు ఎమ్మెల్యేల తరలింపుకు బస్సుల పట్ల కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించారు.

శర్మ కాంగ్రెస్ విధేయుడు……

సాధారణంగా ట్రావెల్స్ యజమానులు ఇటువంటి కార్యక్రమాలకు బస్సులను పంపేందుకు వెనుకంజ వేస్తారు. అయితే శర్మ ట్రావెల్స్ బస్సులను కాంగ్రెస్ పార్టీ వినియోగించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ శర్మ ట్రావెల్స్ బస్సులనుకాంగ్రెస్ ఉపయోగంచడానికి  కారణాలు లేకపోలేదు. శర్మ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకులు ధనరాజ్ శర్మకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉండేది. వాస్తవానికి రాజస్థాన్ కు చెందిన శర్మ 40 ఏళ్ల కిందే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన దివంగత ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీ.వి.నరసింహారావులకు సన్నిహితుడు. ఓసారి దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా సైతం పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్థుడైన శర్మ 17 ఏళ్ల క్రితమే మరణించినా, ఇప్పుడు కర్ణాటక పరిణామాల నేపథ్యంలో ఆయన తో పాటు ఆయన సంస్థకు చెందిన బస్సులు కూడా చర్చనీయాంశమయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*