సిద్ధూ అంటరానివారయ్యారా?

సిద్ధరామయ్య ఎలా అయిపోయారు? ఒంటిచేత్తో గెలిపిస్తానరుకున్న సిద్ధరామయ్య కేవలం 78 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో పరిమితం చేశారు. చివరకు నిన్న కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా నలుగురిలో ఒక్కరిగా మిగిలిపోయారు. ఈ మాజీ ముఖ్యమంత్రిని ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఒక రికార్డే. సిద్ధరామయ్య ఆ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఎన్నికల వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనతోనే మాట్లాడేవారు. ఆయన చెప్పినట్లుగానే కర్ణాటక కాంగ్రెస్ లో నడిచేది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాలన్నీ సిద్ధరామయ్య కనుసన్నల్లోనే నడిచేవి.

జీరో గా మారిపోయి…..

అయితే కన్నడ ప్రజలు ఇచ్చిన విలక్షణ మైన తీర్పుతో నిన్నటి వరకూ పార్టీలో హీరోగా ఉన్న సిద్ధరామయ్య నేడు జీరో అయిపోయారు. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో కూడా ఆయనను పెద్దగా ఎవరూ పలుకరించలేదు. అంతేకాదు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలోనూ సిద్ధరామయ్య మాట చెల్లుబాటు కాదన్న వార్తలు విన్పిస్తున్నాయి. మరో నేత డీకే శివకుమార్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. డీకే శివకుమార్ ఇప్పటికే తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కడంతో ఆయనను సంతృప్తి పర్చే ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు.

మంత్రి పదవుల విషంయలో…..

ఇక సిద్ధరామయ్య విషయానికొస్తే ఆయన కూడా తన వర్గం వారికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాలని పట్టుబడుతున్నారట. కాంగ్రెస్ కర్ణాటక ఇన్ ఛార్జి వద్ద సిద్ధరామయ్య ఈ ప్రతిపాదన పెట్టినా అటు నుంచి పెద్దగా స్పందన కన్పించలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం సిద్దరామయ్య చేజేతులా చేసుకుందేనని అంటున్నారు. సిద్ధరామయ్య ఎన్నికల సమరాన్ని తనకు, మోడీకి మధ్య వార్ గా చిత్రీకరించారు. ప్రచారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. ఇదే తనకు చివరి ఎన్నికలని కూడా ప్రజలను అనేకచోట్ల వేడుకున్నారు.

చాముండేశ్వరి చావుదెబ్బ తీసింది…..

కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య పరపతి కలవాడని ప్రాధాన్యత ఇచ్చింది. సిద్ధరామయ్య తాను ఓడిపోతానని తెలిసి కూడా చాముండేశ్వరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. బాదామిలో గెలిచినా చాముండేశ్వరి మాత్రం హైలెట్ అయింది. ప్రత్యర్థి పార్టీల నుంచి సొంత పార్టీ నేతల వరకూ చాముండేశ్వరిని ఎత్తిచూపే స్థితికి వచ్చారు. తాను గెలవలేని నేత మిగిలిన వారిని ఎలా గెలిపిస్తారని, తమ సొంత బలం, పార్టీ ఇమేజ్ తోనే గెలిచామంటున్నా విజయం సాధించిన ఎమ్మెల్యేలు. దీంతో సిద్ధరామయ్యను ఇప్పుడు పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. పాపం…ఐదేళ్లు కాంగ్రెస్ లోనూ, కర్ణాటకలోనూ చక్రం తిప్పిన సిద్ధూ ఇప్పుడు సొంత పార్టీ వారికే అంటారానివాడిగా మారిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*