గేమ్ స్టార్ట్ చేసిన ఠాక్రే….!

శివసేన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపేది లేదని తేలిపోయింది. శివసేన పరిస్థితిని చూస్తుంటే త్వరలోనే తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మోడీ, అమిత్ షాలంటే మండిపడుతున్న శివసేన ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటోంది. ఇటీవలే శివసేస అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకలిసిచర్చించినా ఫలితం కన్పించడం లేదు. వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుఉండాలంటే తాము కోరినన్ని సీట్లివ్వాలని శివసేన షరతు విధించింది. దీంతో బీజేపీ కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు.

సీఎం పదవిలో శివసైనికుడే….

దీంతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వచ్చే ఎన్నికల్లో శివసైనికుడే ముఖ్యమంత్రి అవుతారని పదే పదే చెబుతున్నారు. తమతో బీజేపీ కలిసి రావల్సిందేకాని, తాము కమలం పార్టీతో కలిసేది లేదని చెప్పారు. ఒకవేళ పొత్తు కుదిరినా అది తమకంటే తక్కువ స్థానాలను తీసుకుని ముఖ్యమంత్రి పదవిని తమకు అప్పగించాలన్నది శివసేన వ్యూహంగా కన్పిస్తుంది. కానీ ఠాక్రే షరతులపై బీజేపీ మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. ఒంటరిగానే పోటీ చేసి అసెంబ్లీలో సత్తా చాటుతామని, శివసేనను దేబిరించాల్సిన పనిలేదని కూడా వారు అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది.

బీజేపీ చిందులు…..

ఈ నేపథ్యంలో శివసేన మరోసారి బీజేపీ పై విమర్శలకు దిగుతోంది. తాజాగా శివసేన అధికార పత్రిక సామ్నాలో బీజేపీ వ్యవహారశైలిని ఎండగట్టింది. కాశ్మీర్ లో ప్రస్తుతమున్న పరిస్థితికి బీజేపీయే కారణమని నిప్పులు చెరిగింది. అరాచకాలను చేసి అక్కడి నుంచి బీజేపీ చల్లగా తప్పుకుందని ఎద్దేవా చేసింది. దురాశతోనే బీజేపీ జమ్ముకాశ్మీర్ లో అధికారం నుంచి తప్పుకుందని అధికార పత్రికలో విమర్శించింది. బీజేపీని బ్రిటీష్ పాలకులతో సమానంగా పరిగణిస్తూ వ్యాసం సాగింది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమైన బీజేపీ, ఆ పాపాన్ని పీడీపీపైకి నెట్టిందని ఆరోపించింది. ఇదంగా ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇదంతా చూస్తుంటే బీజేపీతో శివసేన కలిసే అవకాశాలు లేవనే అంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*