సోమిరెడ్డి…కరెక్ట్ గా నొక్కారే….!

“ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ కు ఇవ్వాలి. టాక్స్ బెనిఫిట్స్ పరిశ్రమలకు ఇస్తే మాకు ఇవ్వాలి. వారికి ఏమి ఇచ్చినా మాకు వాటా ఇవ్వాలి. తెలంగాణకు కాంగ్రెస్, బిజెపి కలిసి మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేస్తే టి కాంగ్రెస్ ఎందుకు అడగటం లేదు” అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు అన్నిపార్టీల్లో కలకలం సృష్ట్టించాయి.

హైదరాబాద్ లో వాటా అడిగిన సోమిరెడ్డి…

“రాజధాని వదిలి కట్టుబట్టలతో వచ్చేశాం. ఎలాంటి మౌలిక వసతులు ఆదాయం మా రాష్ట్రానికి లేవు. ఏపీకి ఏమి ఇచ్చినా మాకు ఇవ్వాలన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సమంజసం గా లేవు. హైదరాబాద్ ఆదాయంలో సగం వాటా ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారా?” అంటూ పంచ్ లు విసిరారు ఎపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రం చేసిన అన్యాయం దేశం ముందు పెడితే టీఆర్ఎస్ ఇలా అడ్డు తగలడం, మెలికలు పెట్టడం సరికాదని హితవు పలికారు ఆయన.

రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ …

సోనియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసే తీర్మానాలు శిలా శాసనం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ గోడు విని న్యాయం చేయాలని రాష్ట్ర విభజనకు సోనియా సంకల్పించారని హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మనకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు లేవని… టీఆరెస్ గొంతులు ఇప్పుడు లేవడం రాజకీయ లబ్ది కోసమేనని రేవంత్ తేల్చేశారు. ఇన్నాళ్ళు ఈ అంశంపై ఎందుకు రాష్ట్రం కేంద్రం తో మాట్లాడలేదని ఆయన నిలదీశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*