వార్ ముగిసేట్లు లేదే….!!

somireddy-chandramohanreddy-vs-adala-prabhakar-reddy

రాజ‌కీయాల్లో నేత‌లు దూకుడుగా ఉంటే ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం కానీ.. అదే నేత‌లు మౌనంగా ఉంటే.. అంటీ ముట్ట‌న ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. మ‌న‌కెందుకులే అనుకుంటే.. మాత్రం ప‌రిస్థితులు అటు పార్టీకి, ఇటు ఇలా అనుకునే నాయ‌కుల‌కు కూడా చెరుపే చేస్తాయి. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఏపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హార శైలిలో ముఖ్యంగా టీడీపీలో ఉన్న‌నాయ‌కుల వ్య‌వ‌హార శైలిని నిశితంగా గ‌మ‌నిస్తే.. ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. కీల‌క‌మైన నాయ‌కులు క‌దుదూరంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతుండ‌డం పార్టీలోని శ్రేణుల‌ను క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. జెండా మోసేవాడు ఉన్నా.. న‌డిపించేవాడు లేక కార్య‌క‌ర్త‌లు ఈసురో మంటున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

బాబు హెచ్చరించిన తర్వాత….

విషయం ఏంటంటే.. నెల్లూరులో టీడీపీకి కీల‌కంగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఒకింత హెచ్చ‌రించిన త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు క‌నిపించినా.. ఆశించిన మేర‌కు మాత్రం ఈ ప‌రిస్థితి ఆజాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.. పార్టీలోని సీనియ‌ర్లు. ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌కు కోవూరు, ఆత్మ‌కూరు రూర‌ల్‌, స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా జిల్లా మొత్తంగా కూడా మంచి ప‌ట్టుంది. పార్టీకి దిశానిర్దేశం చేయ‌డంలోనూ వీరు నిపుణులే. వీరి క‌లిసి క‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. కార్య‌క‌ర్త‌లు జోరందుకునేందుకు కూడా సిద్దంగానే ఉన్నారు.

క్యాడర్ లో అసంతృప్తి……

అయితే, వ్య‌క్తిగ‌త విష‌యాలతో వీరు ఒకింత అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి జిల్లాలోని చాలా నియోజకవ ర్గాల్లో టీడీపీ స్తానిక నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య దోర‌ణి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉన్నా.. కూడా త‌మ‌కు ఏమీ ఒరిగింది లేద‌నే అసంతృప్తి కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీరంద‌రినీ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అదే స‌మ‌యంలో పార్టీని పుంజుకునేందుకు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సిన స‌మ‌యంలో నాయ‌కుల మ‌ధ్య అసంతృప్తి రాజ్య‌మేలుతుండ‌డంతో ఎవ‌రికివారే య‌మునాతీరే అనే చందంగా ప‌రిస్థితి మారింది.

ఒకే వేదికపైకి వస్తారా?

ఈ నేప‌థ్యంలో జిల్లాపై ప‌ట్టున్న నాయ‌కులుగా గుర్తింపు పొందిన సోమిరెడ్డి, ఆదాల ఒకే వేదిక‌పైకి వ‌చ్చి.. ఆయా నియో జకవ‌ర్గాల్లో నెల‌కొన్న ప‌రిస్తితుల‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేయాల‌ని ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు కూడా ఇదే సూచ‌న చేసిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయాల‌ని, త‌ద్వారా జిల్లాలో పార్టీని పుంజుకునేలా చేసి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గెలిచేలా చూడాల‌ని కోరుతున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రు నాయ‌కులు క‌లిస్తే.. గెలుపు సైకిల్‌దేన‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*