సోముకు ఈ శాపం ఏంటి… ?

సోముకు నోటి దుర‌దే బాగా దెబ్బేసిందా అంటే అవును! ఇదే నిజ‌మ‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. బీజేపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అంద‌కుండా పోయిన ఏపీ బీజేపీ ప‌గ్గాల‌పై అనేక క‌థ‌నాలు ఇప్పుడు సోష‌ల్ మీడియా స‌హా సైట్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీట‌న్నింటిలోనూ ఒకే ఒక్క రీజ‌న్ స్ప‌ష్టంగా వినిపిస్తోంది. సోముకు ఉన్న దూకుడే ఆయ‌న‌కు ప‌ద‌వి లేకుండా చేసింద‌ని అంటున్నారు. వాస్త‌వానికి సోము వీర్రాజు రాజ‌కీయాల్లో సీనియ‌ర్‌. ఆయ‌న‌కు బీజేపీ ఆనుపానులు బాగా తెలుసు. ఆర్ ఎస్ ఎస్ భేటీల‌కుకూడా ఆయ‌న హాజ‌ర‌వుతుంటారు. సంఘ్ కార్య‌క‌లాపాల‌కు కూడా హాజ‌ర‌వుతారు.

సంఘ్ తో దగ్గరి సంబంధాలు…..

సంఘ్ నుంచి నేతలు ఎవ‌రు వ‌చ్చినా త‌ప్ప‌కుండా వెళ్లి వారితో విష‌యాలు చ‌ర్చిస్తారు. పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాల‌పైనా ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. ఈ నేప‌థ్యంలోనే సోమును రాష్ట్ర బీజేపీ సార‌ధిగా ఎంచుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఈ ప‌ద‌వికి ఎంపిక కాలేకపోయారు. వాస్త‌వానికి ఏపీ నుంచి వెళ్లిన బీజేపీ సార‌ధుల జాబితాలో సోము పేరు ప్ర‌థ‌మ భాగంలోనే ఉంది. ఈయ‌న‌కు ప్ర‌ధానంగా మాజీ మంత్రి మాణిక్యాల రావు పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తిచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌లో సోమును మించిన నాయకుడు లేడ‌ని మాణిక్యాల‌రావు అధిష్టానం వ‌ద్ద చెప్పారు. తొలుత ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను మాణిక్యాల రావుకే ఇవ్వాల‌ని అధిష్టానం ప్ర‌తిపాదించింది.

టీడీపీని ఢీకొట్టాలంటే….

ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఢిల్లీ నుంచి క‌బురు కూడా వ‌చ్చింది.దీంతో ఆయ‌న ఢిల్లీ వెళ్లి.. ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ రాం మాధ‌వ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు బీజేపీ సార‌ధ్య బాధ్య‌త‌లు నిర్వ‌హించే స‌త్తా లేద‌ని, ఆవేశం ఎక్కువ‌ని, పైగా ఆర్థికంగా కూడా తాను ఇబ్బందుల్లో ఉన్నాన‌ని మాణిక్యాల రావు పేర్కొన్నారు. ఇక‌, ఈ జాబితాలోనే ఉన్న సోము వీర్రాజును ఆయ‌న అధిష్టానానికి సిఫార‌సు చేశారు. టీడీపీని ఢీ కొట్టేందుకు సోము లాంటి నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న బీజేపీ నాయ‌కులు చెప్పిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. దీనిపై అధిష్టానం కూడా ప‌చ్చ‌జెండా ఊపేందుకు రెడీ అయినా.. బీజేపీలోని మ‌రో వ‌ర్గం మాత్రం సోము దూకుడుకు సంబంధించిన వీడియో, ఆడియో టేపుల‌ను అధిష్టానానికి అంద‌జేసిన‌ట్టు స‌మాచారం.

నాయకులు దూరం అవుతారని….

అయిన దానికి కాని దానికీ సీరియ‌స్ అయ్యే ల‌క్ష‌ణం సోముకు ఎక్కువ‌ని, ఆయ‌న స‌మ‌న్వ‌యం చేయ‌లేర‌ని, నాయ‌కులు దూరం అవుతార‌ని, అదే స‌మ‌యంలో కాంగ్రెస్ స‌హా ఇత‌ర పార్టీల్లోని అసంతృప్తుల‌ను ఆయ‌న రాబ‌ట్ట‌లే ర‌ని కూడా బీజేపీకి ఫిర్యాదులు వెళ్లాయి. క‌న్నా ఏపీ రాజ‌కీయాల్లో దాదాపుగా రెండున్న‌ర ద‌శాబ్దాలుగా తిరుగులేని లీడ‌ర్‌గా ఉన్నారు. ఆయ‌న రాజ‌కీయంగా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు కాపు క‌మ్యూనిటీలో కూడా బ‌లంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అయితే ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలోకి ఆక‌ర్షించ‌డంలో స‌క్సెస్ అవుతార‌న్న నివేదిక‌లు కూడా అధిష్టానానికి వెళ్లాయి.

సోముకు వ్యతిరేక వర్గం……

ఇక రాజధాని ప్రాంతం నుంచి కూడా క‌న్నా ఉండ‌డంతో చివ‌ర‌కు క‌న్నా అయితేనే క‌రెక్ట్ అన్న నిర్ణ‌యానికి బీజేపీ వ‌చ్చేసింది. సోము అంటే ఏపీ బీజేపీలోనే స‌గం మందికి ప‌డే ప‌రిస్థితి లేదు. ఇది కూడా సోముకు పెద్ద మైన‌స్ అయ్యింది. ఆయ‌న దుందుడుకు చ‌ర్య‌ల వ‌ల్ల ఏపీ బీజేపీలోకి వ‌చ్చే వాళ్ల కంటే పోయే వాళ్లే ఎక్కువుగా ఉండే ప‌రిస్థితులు కూడా క‌నిపిస్తున్నాయి. ఇక క‌న్నాకే ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని రామ్ మాధ‌వ్ కూడా గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలిసింది. ఇక సోము వ్య‌వ‌హారంపై ఏపీకి చెందిన జీవీఎల్ న‌ర‌సింహారావు ద్వారా కూపీ లాగిన బీజేపీ అధిష్టానం చివ‌ర‌కు ఆయన‌ను ఈ ప‌ద‌వికి ఎంపిక చేయ‌కుండా పెద్ద‌గా ప్రాధాన్యం లేని ఎన్నిక‌ల క‌మిటీ క‌న్వీన‌ర్‌గా నియ‌మించింది. ఈ ప‌రిణామం సోము వ‌ర్గాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. రాబోయే రోజుల్లో సోము ఎలా స్పందిస్తారో చూడాలి.

1 Comment on సోముకు ఈ శాపం ఏంటి… ?

  1. Yes…Somu Veerraju is semi-matured leader. he only useful for immediate attack without any planning.
    But Kanna Lakshminarayana is a Matured Leader and having more strength in Followers.
    He is suitable for present situation. BJP High Command acted on time. Welcome for good AP in future.

Leave a Reply

Your email address will not be published.


*