బాబుపై మరోసారి బాంబుపేల్చిన సోము

somu veerrajju on alliances

పోలవరం ప్రాజెక్టులో తెరవెనుక చాలా జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. 2014లోనే పోలవరం పనులను చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతితో కూరుకుపోయిందన్నారు. పట్టిసీమలో భారీ అవినీతి జరిగిందన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో 37 కోట్ల రూపాయలు టీడీపీ నేతలు దోచుకున్నారని చెప్పారు. ఏపీలో విద్యావ్యవస్థను నీరుగార్చారన్నారు. గుజరాత్ లో 95 శాతం మంది పిల్లలు, కేరళలో 90 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే చంద్రబాబు మాత్రం వాటిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారన్నారు. ప్రయివేటు పాఠశాలలకు దోచి పెడుతున్నారన్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన విమర్శించారు.

ఇప్పటివరకూ ఏం చేశారు?

2016 వరకూ చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారన్నారు? నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటికి ఎందుకు ఖర్చు చేయలేదన్నారు. నీరు చెట్టు పథకం కింద ఖర్చు చేసిన సొమ్ముతో 15 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చని సోము అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏ శాఖ చూసినా అవినీతి రాజ్య మేలుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేస్తూ టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. ఎన్నికల హామీలను ఎక్కడ అమలుపర్చారన్నారు. తాము విభజన హామీలు అమలుపరుస్తున్నా, తమపై ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. చంద్రబాబు తొలుత ఆయన ప్రకటించిన ఎన్నికల మ్యానిఫేస్టోపై దృష్టి పెట్టాలన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చే విషయం నాలుగో సంవత్సరం వస్తేగాని గుర్తుకు రాలేదా? అని ఎద్దేవా చేశారు. ఏపీలో పరిపాలన లేదన్నారు. గత కొద్ది నెలలుగా ప్రజల సొమ్ముతో దీక్షలు చేస్తూ పక్కదోవపట్టిస్తున్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*