ఈ మర్డర్ మిస్టరీ వీడదా?

అపార్ట్‌మెంట్‌లో హత్య ఎవరు చేశారు ? చడీచప్పుడు కాకుండా.. మర్డర్‌ ఎలా చేశారు ? ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే.. పక్కా ప్లాన్డ్‌ మర్డర్‌ అన్నది మాత్రం స్పష్టమవుతోంది. మరి.. ఈ మిస్టరీ వీడేదెలా ? పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ? నిజాలు తేలటానికి సెకరించిన సాక్ష్యాలు ఏంటి?

* మిస్టరీగా మారిన సౌమ్య మర్డర్
* హత్య ఎవరు చేశారు?
* ఇంట్లోకి ఎవరు వచ్చారు ?
* హత్య ఆనవాళ్లు దొరక్కుండా చేసినట్లు పోలీసుల అంచనా
* తెలిసిన వాళ్లే చంపేశారా ? దోపిడీ దొంగల పనా ?
* అనవాళ్ళు దొకక్కుండా ఏం చేశారు ?.
హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన వివాహిత సౌమ్య మర్డర్ మిస్టరీగా మారింది. ఆమె హత్య పై ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి. అసలు హత్య ఎవరు చేశారు? భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోకి ఎవరు వచ్చారు ? హత్య చేసిన తర్వాత బయట డోర్ కు లాక్ చేయడం.. ఆమె సెల్‌ఫోన్‌ను ట్యాంకులో పడేయడం.. ఇవన్నీ హత్య ఆనవాళ్లు దొరక్కుండా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చివరిగా సౌమ్య ఎవరితో మాట్లాడింది.. తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా.. లేక దోపిడీ దొంగల పనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

* నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లిన సౌమ్య భర్త నాగభూషణం
* అర్ధరాత్రి తర్వాత అపార్ట్‌మెంట్‌లో పొగలు, కాలుతున్న వాసన
* అప్పటికే మరణించిన నాగభూషణం భార్య సౌమ్య
* గుర్తు పట్టలేని విధంగా ఎవరు చంపారు?
* దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వుంది?
విశాఖపట్నం జిల్లా దొండపర్తిలో నివాసం ఉంటున్న పున్నారావు, రమణి దంపతుల మొదటి కుమార్తె సౌమ్య. విశాఖ పట్నం ఎల్ఐసీ కాలనీకి చెందిన నాగభూషణంతో 2012 లో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నాగభూషణం.. అస్సాంలో ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆనంతరం హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎల్ అండ్‌టీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో.. హైదరాబాద్‌కు మారిపోయిన నాగభూషణం దంపతులు.. ఎర్రగడ్డ శంకర్‌సింగ్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు… అప్పటివరకు ఆనందగా జరిగిన ఆ కుటుంబంలో ఈ విషాద ఘటన జరిగింది.సౌమ్య భర్త నాగభూషణం నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత అపార్ట్‌మెంట్‌లో పొగలు, కాలుతున్న వాసన వస్తుండటంతో అందులో నివాసముంటున్న వారు అప్రమత్తమయ్యారు. అపార్ట్‌మెంట్ మొత్తం కలియదిరిగి పరిశీలించగా నాగభూషణం గది నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే గది తలుపులు తీసి లోపలికెళ్లి చూడగా నాగభూషణం భార్య సౌమ్య మంటల్లో దహనమై అప్పటికే మరణించింది. ఆ పక్కనే బెడ్‌పై ఏడుస్తున్న ఆమె కుమారుణ్ని రక్షించి బయటకు తీసుకొచ్చారు. నాగభూషణంకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. సౌమ్యపై ఎవరైనా అత్యాచారం చేసి హతమార్చారా లేదా దొంగల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

* అంత దారుణంగా హత్య చేయడానికి కారణాలేంటి ?
* సౌమ్య హత్య తర్వాత ఇంటిగేటుకు తాళం
* సౌమ్య సెల్‌ఫోన్‌ మాయం చేసే ప్రయత్నం
* సౌమ్య ఒంటరిగా ఉంది అని తెలుసుకొనే చేశారా?
* ఇదంతా తెలిసిన వారి పక్క స్కెచ్చా..?
సౌమ్య భర్త నాగభూషణం నైట్ డ్యూటీకి వెళ్లిన తర్వాత.. ఇంట్లోకి ఎవరు వచ్చారు. సౌమ్యను అంతదారుణంగా హత్య చేయడానికి గల కారణాలేంటి ? అని పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సౌమ్యను హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు దొరకుండా ఇంజన్ అయిల్‌తో నిప్పంటించిన దుండగుడు.. అనంతరం ఇంటి బయట గేటుకు తాళం వేశాడు. అంతేకాదు..ఆమె సెల్‌ఫోన్‌ను దొరక్కుండా మాయం చేయడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ చూస్తే.. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.తెలిసిన వారు చేసిన దారుణ హత్య అన్న కోణం లో కూడా దర్యప్తు చేస్తునారు ..సామ్య నెంబర్ కాల్ డేటా ను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.

* క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు…
* పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ
* సామ్య కాల్ డీటైల్స్ లో కీలక ఆధారాలు
* ఘటనా స్థలంలో సెకరించిన ఫింగర్ ప్రింట్స్
* ఇప్పటికే కొంత కీలక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు

సౌమ్య కుటుంబ సభ్యులు ఆమె భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నా.. నాగభూషణం ఆసమయంలో ఇంట్లో లేకపోవడం.. ఎనిమిది గంటలకే డ్యూటీకి వెళ్లాడని చెప్పడంతో పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించాలన్న ఆలోచనల్లో పడిపోయారు. ఇప్పటివరకు సౌమ్య హత్యపై ఎలాంటి క్లూ లభించకపోవడంతో.. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో రెండు మూడు రోజుల్లోనే కేసును ఛేదిస్తామని పోలీసులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే కొంత కీలక సమాచారాన్ని సేకరించిన పోలీసులకు నిందితుని తాలుకా మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందని త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పొలీసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*