ప్లే ఆఫ్ కి చేరిన తొలిజట్టు ఇదే …!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఇంకా కొన్ని మ్యాచ్ లు మిగిలివుండగానే ప్లే ఆఫ్ కి చేరిన తొలి జట్టుగా అడుగుపెట్టింది. మొత్తం ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో తొమ్మిదింటిలో గెలిచి తన సత్తా చాటి హైదరాబాద్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన క్లిష్టమైన మ్యాచ్ ను సునాయాసంగా ఫినిష్ చేసి సగర్వంగా ప్లే ఆఫ్ కి అడుగుపెట్టేసింది సన్ రైజర్స్. ఇప్పటివరకు ఐపీఎల్ లో అన్ని జట్ల కన్నా విజయాల్లో దూసుకుపోతున్న సన్ రైజర్స్ ఇప్పుడు టోర్నీ హాట్ ఫేవరెట్ లలో ఒకటిగా వచ్చే మ్యాచ్ లకు సిద్ధం అవుతుంది.

బౌలింగ్ బ్యాటింగ్ లలో అద్భుత నైపుణ్యంతో …

లో స్కోర్ మ్యాచ్ లను సైతం తన అద్భుత బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ కాపాడుకుని విజయతీరాలకు చేరేది. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ లో భారీ స్కోర్ ను అలవోకగా ఛేదించి బ్యాటింగ్ లోను సత్తా చాటిచెప్పింది సన్ రైజర్స్. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐదు వికెట్లు నస్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం భారీ స్కోర్ ఛేదనకు దిగిన సన్ రైజర్స్ కి ఆదిలోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. తొలివికెట్ తొందరగా పడగొట్టిన సంతోషం ఢిల్లీ కి ఏమాత్రం దక్కకుండా కెప్టెన్ విలియంసన్, శిఖర్ ధావన్ లు అద్భుతంగా ఆడి ఒక వికెట్ నష్టపోయి ఒక ఓవర్ మిగిలి ఉండగానే 191 పరుగులు సాధించి సూపర్ విక్టరీ కొట్టేశారు. ఢిల్లీ టీం లో రిషిబ్ పంత్ 63 బాల్స్ లో 128 పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే సన్ రైజర్స్ టీం లో ధావన్ 50 బంతుల్లో 92, విలియంసన్ 53 బంతుల్లో 83 పరుగులతో నాటౌట్ గా నిలవడం విశేషం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*