టీజీని ఓడించడమే టార్గెట్….!!!

sv-mohanreddy-vs-tg-venkatesh

ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు అర్బన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్వీ మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తన బావ భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికే టిక్కెట్ వచ్చేలా ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నించి సఫలమయ్యారు. అయితే తాజాగా ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు టీడీపీ టిక్కెట్ గల్లంతయింది. పార్టీ మారి వచ్చినా తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలు అర్బన్ నియోజకవర్గానికి టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ అభ్యర్థిత్వానికే నారాచంద్రబాబునాయుడు ఓటేశారు.

పోటీ చేయకుండా….

గత రెండు రోజులుగా ఎస్వీ మోహన్ రెడ్డి తన ముఖ్య సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. అనుచరులతో కొద్దిసేపటి క్రితం కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. జనసేన నుంచి పోటీ చేయాలని ఆయనపై కార్యకర్తలు వత్తిడి తెస్తున్నారు. అయితే ఎస్పీవై రెడ్డిలాగా తాను జనసేనలోకి చేరి పోటీలోకి దిగకూడదని ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా ఎస్వీ మోహన్ రెడ్డి చేయడం విశేషం. తన కుటుంబానికి చంద్రబాబు మూడు సార్లు మోసం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

వైసీపీలో చేరి…

ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ తనను ఆదరించి టిక్కెట్ ఇచ్చిందని, తాను ఆ పార్టీని మోసంచేసి వచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్ననని ఎస్వీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో చేరి ఆపార్టీ విజయానికి కృషి చేస్తానని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చెప్పడంతో ఎస్వీ వ్యూహం అర్థమవుతోంది. తాను నేరుగా పోటీలోకి దిగితే అది టీడీపీకి లాభం చేకూరుతుంది. టీజీ భరత్ విజయానికి తాను కారణం కాకూడదన్నది ఎస్వీ మోహన్ రెడ్డి ఆలోచన.

కసి తీర్చుకోవాలని…..

టీజీ భరత్ ను ఓడించాలంటే తాను పోటీ చేయకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడమే మేలన్న నిర్ణయానికి ఎస్వీ మోహన్ రెడ్డి వచ్చారు. దీంతో కర్నూలు రాజకీయం రసకందాయంలో పడింది. మంత్రి నారాలోకేష్ తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినా చివరి నిమిషంలో నంద్యాల అసెంబ్లి నియోజకవర్గానికి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ముడిపెట్టి తనను తప్పించారంటున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన ప్రభావం కూడా ఎంతో కొంత నియోజకవర్గంలో ఉండే అవకాశముంది. అయితే టీజీ వర్గం ఇది ముందుగానే ఊహించిందేనంటున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశముంది.

Ravi Batchali
About Ravi Batchali 15694 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*