ఏపీలో ‘‘తంబి’’ల తాయిలాలు…!!

tamilnadu politics in andhrapradesh

అదేంటి? అనుకుంటున్నారా? మ‌న రాజ‌కీయ నేత‌లు అనుకుంటే కానిదంటూ ఏముంటుంది? తిమ్మిని బ‌మ్మిని చేయ డంలో సమ‌ర్ధులు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఏపీని కూడా త‌మిళ‌నాడు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా తెలు స్తోంది. ఇది ఏ ఒక్క‌రో చేస్తున్న ప్ర‌య‌త్నం కాదు. మొత్తం అన్ని రాజ‌కీయ పార్టీలు చేస్తున్న నిర్వాకంగానే క‌నిపిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. దీంతో ప్ర‌తి పార్టీ ముఖ్యంగా అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ, మ‌రో విప‌క్షం జ‌న‌సేన‌లు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించి అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇంటింటికీ స్మార్ట్ ఫోన్లు….

ఎవ‌రికి వారు నేనే సీఎం అంటే నేనే సీఎం అని ప్ర‌క‌టించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు మ‌ళ్లిం చుకునేందుకు పార్టీలు వివిధ రూపాల్లో ముందుకు వెళ్తున్నాయి. అధికార టీడీపీ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు దూకుడు ప్ర‌ద ర్శించింది. రుణ‌మాఫీ, వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, వివిధ ఉచితాలు, సామాజిక పింఛ‌న్లు అంటూ పెద్ద ఎత్తున నిధులు పారిస్తోంది. వీటికితోడు ఇప్పుడు ఇంటింటికీ స్మార్ట్ ఫోన్ ఇవ్వాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించు కున్నారు. ఇప్ప‌టికే ఇస్తున్న ఉచితాల‌కు ఇది కొస‌రన్న‌మాట‌! ఇక‌, అన్న క్యాంటిన్ల ద్వారా 75 రూపాయ‌ల భోజ‌నాన్ని.. రూ.5 కే అందిస్తున్నారు. ఇలా అధికార పార్టీ దూకుడు చూపిస్తోంది.

వైసీపీ,జనసేనలు పోటీ పడుతూ….

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ ఎక్క‌డ అధికారంలోకి వ‌స్తుందోన‌ని భావిస్తున్న ఇత‌ర పార్టీలు బాబును మించి హామీలు గుప్పిస్తున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏకంగా మ‌హిళ‌ల‌ను బుట్ట‌లో వేసుకునేందుకు ఉచిత వంట‌గ్యాస్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా విద్య‌, ఉపాధి, ఆరోగ్యానికి సంబంధించిన ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యం లో తాను మాత్రం త‌క్కువ తిన్నానా? అని భావిస్తున్న జ‌గ‌న్‌.. కూడా ఇదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే.. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు తోడు మ‌రిన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నారు. లాయ‌ర్లు, కార్మికులు, డ్రైవ‌ర్లు, వైద్యులు. మ‌హిళ‌లు, వృధ్దుల ఇలా స‌మాజంలోని చెట్టు పుట్ట, పిట్ట‌ల‌ను వ‌దిలేసి.. ఈ నేత‌లు రెచ్చిపోతున్నారు.

ఉచితం అంటూ….

దీంతో ఇప్పుడు ఏపీ కూడా త‌మిళ‌నాడు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిప‌స్తున్నాయి. ఇంత‌కీ త‌మిళ‌నాడు గురించి చెప్పుకోలేదు. అక్కడ ఎలాంటి ఎన్నిక‌లు జ‌రిగినా.. అన్ని పార్టీలూ ఉచితాల‌కు ఉచితంగా హామీలు ఇస్తుంటాయి. ఇంట్లో వాడుకునే దువ్వెన నుంచి టీవీ వ‌ర‌కు కూడా అన్ని ఉచితాలే! దీంతో రాష్ట్రం ఇప్పుడు దివాలా ప‌రిస్థితిలో ఉంద‌ని త‌మిళ‌నాడు స్వ‌యంగా ప్ర‌క‌టించింది. మ‌రి ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా?!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*