కారు జోరుకు ‘‘హ్యాండ్’’ బ్రేక్‌..!

తెలంగాణ‌లో రాజ‌కీయ పెనుసంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? త‌మ‌కు తిరుగులేద‌ని, తెలంగాణ రాష్ట్రం మొత్తం త‌మ తోనే ఉంటుంద‌ని భావిస్తున్న అధికార టీఆర్ ఎస్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుందా? అంటే తాజాప‌రిణామాలు ఔన‌నే సంకేతాల‌నే ఇస్తున్నాయి. టీఆర్ ఎస్ ప్ర‌భావం భారీ ఎత్తున ఉన్న 2014 ఎన్నిక‌ల్లోనే ఆ పార్టీ 119 స్థానాల‌కుగాను కేవ‌లం 67 కే ప‌రిమిత‌మైంది. అలాంటి పార్టీకి ఇప్పుడు మ‌రింత‌గా ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు, వివిధ పార్టీల్లోని అసంతృప్తుల చేరిక‌తో బ‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితులు ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. మ‌రో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.

టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ…..

ఈ క్ర‌మంలో అధికార టీఆర్ ఎస్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు.. అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తోంది. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఈ యాత్ర సంద‌ర్భంగా వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. టీ టీడీపీ నేత‌లు స‌హా అధికార పార్టీకి చెం దిన అసంతృప్తులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందో రాదో న‌ని భావిస్తున్న నాయ‌కులు ఇప్పుడు బ‌స్సుయాత్ర సంద ర్భంగా కాంగ్రెస్ కండువా క‌ప్పుకొంటున్నారు. పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌ రావు స‌హా రేవంత్ రెడ్డి అనుచ‌రులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.

ఒంటేరు చేరికతో…..

అదేవిధంగా గ‌జ్వేలు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. అలాగే.. టీటీడీపీలో మిగిలిన ప‌లువురు కీల‌క నేత‌లు కూడా కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌లో చేరే చాన్స్ ఉంద‌ని స‌మాచారం. పెద్దిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేస్తార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డు తున్నారు. ఇక పాత ఖ‌మ్మం జిల్లాలోనూ టీఆర్ఎస్‌లో టిక్కెట్లు రావ‌ని డిసైడ్ అయిన వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇలా.. ఒక్క‌రొక్క‌రుగా వివిధ పార్టీ ల నుంచి కాంగ్రెస్‌లో చేరుతుండ‌డంతో పార్టీ బ‌లం నానాటికీ పెరుగుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి టీఆర్ ఎస్‌కు మ‌రిన్ని పంక్ఛ‌ర్లు ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న‌టి వ‌ర‌కు కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుతో విప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేస్తే ఇప్పుడు అక్క‌డ బండి ఓవ‌ర్‌లోడ్ కావ‌డంతో వాళ్లంతా కాంగ్రెస్ వైపు చూస్తుండ‌డం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*