లెక్క పక్కాగానే ఉందట….!

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగితే అధికారపార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పక్షాలు ఎవరు సిద్ధంగా లేరు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కెసిఆర్ కు ముందస్తుపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక కాంగ్రెస్, బిజెపి, టిడిపి లు ఏమాత్రం నిలదొక్కుకోలేవని విశ్లేషకులు అంటున్నారు. మరోపక్క కోదండరాం కొత్త పార్టీ కేత్ర స్థాయిలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటుంది. ఆ పార్టీ ముందస్తు ఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కొనే సత్తా లేదన్న లెక్క పక్కాగా కెసిఆర్ దగ్గర ఉందంటున్నారు. ఇక కాంగ్రెస్ పైకి ఎన్ని అరుపులు అరుస్తున్నా ఆర్ధిక అంగబలాల సమీకరణ అంత ఈజీ కాదని, ఉత్తమకుమార్ రెడ్డి గ్రూప్ లన్నిటిని ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకు, నిధుల సేకరణకు సమయం సరిపోదని టి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బిజెపి పరిస్థితి మరీ ఘోరం …

తెలంగాణాలో బిజెపి పరిస్థితి మరీ ఘోరంగా వుంది. ఆ పార్టీలో గత కొద్ది కాలంగా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కెసిఆర్ నేరుగా కమలం అధిష్టానంతో నిత్యం టచ్ లో ఉండటంతో రాష్ట్ర బిజెపి శాఖ నీరసంగా కనిపిస్తుంది. గతంలో బస్సు యాత్ర నిర్వహించిన తెలంగాణ బిజెపి శాఖ ఆ తరువాత కంటిన్యూ పొలిటికల్ యాక్టివిటీ మరొకటి చేపట్టలేదు. హైదరాబాద్ వరకు బిజెపికి కొంత మెరుగ్గా వున్న జిల్లాల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో క్రీయాశీలకంగా లేదని ఆ పార్టీ వారే ఆఫ్ ది రికార్డ్ లో అంగీకరిస్తున్నారు.

పొత్తులపై ఇంకా…..

ఇక టిడిపి లీడర్ లెస్ క్యాడర్ ఫుల్ పార్టీగా నడుస్తుంది. సైన్యాధిపతి లేని సైన్యం కదనరంగంలో అస్తవ్యస్తంగా ఎలా నడుస్తుందో అదే పరిస్థితి టిటిడిపి ది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం కలవరిస్తోంది. కాంగ్రెస్ తోనే జట్టు కట్టేందుకు దాదాపు రంగం సిద్ధమయిపోయింది. ఎవరికెన్ని స్థానాలు అన్నదానిపై పొత్తులు ప్రక్రియ ఇక జరగాల్సి ఉంది. రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కాంగ్రెస్ తో సైకిల్ పార్టీ జత కట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. కానీ ఇంకా ఒక నిర్ణయం మాత్రం వెలువడ లేదు. దాంతో ఇదే మంచి తరుణమని ముందస్తుకు గులాబీ బాస్ ఉరకలు వేస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*