సైకిల్ పరుగులు తీయడం కష్టమే…!

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మ‌లుపుతిరుగుతున్నాయి. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ రాజ‌కీయ నాయకులు కూడా త‌మకు అనుకూలంగా చ‌క్రం తిప్పేందుకు త‌లో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కొంద‌రు నేత‌లు ముందుకు సాగుతుంటే.. మ‌రికొంద‌రు గెలుపు గుర్రాలెక్క‌డే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వెర‌సి ఈ జిల్లాలో మాత్రం అభివృద్ధి కుంటుప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఇక్క‌డ మొత్తం 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింది. మొత్తంగా ఆరు చోట్ల వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

నలుగురు టీడీపీ తీర్థం పుచ్చుకుని….

టీడీపీ ఐదు స్థానాల్లో విజ‌యం సాధించింది. ఒక చోట మాత్రం స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. అయితే, రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల ప‌ర్య‌వ‌సానంగా టీడీపీ ఆక‌ర్ష్ మంత్రానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిదా అయిపోయారు. ఇలా మొత్తం న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక‌రు మంత్రిగా ప‌నిచేస్తున్నారు. శిద్దా రాఘ‌వ‌రావు.. చంద్ర‌బాబు కేబినెట్లో సీటు సంపాయించారు. సీనియ‌ర్ నేత‌గాకూడా చ‌క్రం తిప్పుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న జోక్యం అంత‌గా ఉండ‌డం లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జులే చ‌క్రం తిప్పుతున్నారు. కానీ, వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం తీవ్ర‌స్థాయిలో ఆధిప‌త్య పోరు సాగుతోంది.

నేతల మధ్య సఖ్యత కొరవడి…..

ఇక‌, టీడీపీ సొంత‌గా గెలిచిన స్థానాల్లోనూ నేత‌ల మ‌ధ్య సఖ్య‌త కొర‌వ‌డుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ‌గా ఉండ‌డంతో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఇక‌, వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో టీడీపీకి నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నా.. వ‌ర్గ‌పోరుతో పార్టీ ప‌రువు.. పోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ మాట సీనియ‌ర్లు వినే ప‌రిస్థితి లేదు. ఒంగోలు సిటీలో దామ‌చ‌ర్ల‌కు ఎమ్మెల్సీ మాగుంట‌కు పొస‌గ‌డం లేదు. కొండ‌పిలో దామ‌చ‌ర్ల ఫ్యామిలీలోనే రెండు గ్రూపులు ప‌ని చేస్తున్నాయ్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*