సైకిల్ లైన్ తప్పుతుందా?

అనంత‌పురం జిల్లా…టీడీపీకి కంచుకోట‌. ఇక్కడ ఏ స్థానంలోనూ టీడీపీ హ‌వా న‌డుస్తోంది. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల క‌న్నా కూడా ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ అభివృద్దికి, ఉపాధి క‌ల్పన‌కు పెద్ద పీట వేస్తున్నారు. అంత‌ర్జాతీయ ఆటో దిగ్గజం కియా కార్ల ప‌రిశ్రమ‌ను ఇక్కడే ఏర్పాటు చేయించారు. ఫ‌లితంగా ఇక్కడ యువ‌త‌కు ఉపాధి ల‌భించ‌డంతోపాటు.. స్థానికంగా మౌలిక వ‌స‌తులు పెంచేందుకు అంత‌ర్జాతీయంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు చంద్రబాబు బాట‌లు ప‌రిచారు. ఇక్క‌డ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల‌కు త‌క్కువ‌కాకుండా మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. గ‌తంలో ఇక్కడ నుంచి ప‌రిటా ల సునీత‌, ప‌ల్లెర‌ఘునాథ‌రెడ్డిల‌ను మంత్రులుగా చేశారు.

ఇద్దరు మంత్రులున్నా…..

త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో రఘునాథ రెడ్డిని ప‌క్కకు పెట్టి.. కాల్వ శ్రీనివాసుల‌కు అవ‌కాశం క‌ల్పిం చారు. ఇప్పుడు కూడా ఇద్దరు మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే మిన‌హా మిగిలిన సీట్లన్ని టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. అనంత‌పురంతో పాటు హిందూపురం ఎంపీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీలు కూడా జిల్లాకు ఇచ్చారు. అంత‌టి విశిష్టమైన ప్రాధాన్యం ఉన్న ఈ జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్కడ ఎంతో మంది బలం ఉన్నప్పటికీ.. టీడీపీ పుంజుకోలేక పోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? వ‌ంటి కీల‌క అంశాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి. దీనికి ప్రధాన కార‌ణం.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి, ఒక‌రిపై ఒక‌రికి గుస్సా. అధినేత వ్యాఖ్యల‌ను ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం, పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవ‌హ‌రించ‌డం వంటివి స్పష్టంగా క‌నిపిస్తున్నాయి.

దీపక్ రెడ్డి దూకుడు…..

తాజాగా రాయ‌దుర్గంలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు గెలుపొం దారు. బోయ వ‌ర్గానికి చెందిన‌న శ్రీనివాసులుకు ఇక్కడ మంచి ప‌ట్టుంది. మాస్ లీడ‌ర్‌గా సౌమ్యుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. విద్యావంతుడు, మాజీ జ‌ర్నలిస్టు కావ‌డంత ఇక్కడి ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు. ఆయ‌న గ‌తంలో అనంత‌పురం ఎంపీగా కూడా ప‌నిచేయ‌డంతో ఇక్కడి స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలోనూ ఆయన మంచి మార్కులే సంపాయించుకున్నారు. కానీ, ఇక్కడ ఆయ‌న‌కు వ్యతిరేకంగా పావులు క‌దుపుతుండ‌డం గుర్తించాల్సిన విష‌యం. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దీప‌క్‌రెడ్డికి, మంత్రి కాల్వ వ‌ర్గానికి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. నాకు న‌వ్వు చెప్పేదేంటి.. నేనుకూడా పార్టీలో సీనియ‌ర్‌నే అనే రేంజ్‌లో దీప‌క్ రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు.

వైసీపీకి లాభమేనా?

దీనికితోడు.. ఆయ‌న జేసీ వ‌ర్గంగా పేరుపొందారు. నెల్లూరు జిల్లాకు చెందిన గుణ‌పాటి దీప‌క్‌రెడ్డి జేసీకి అల్లుడు అవుతారు. దీంతో జేసీ అండ చూసుకుని దీపక్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి అనుచ‌రుడిని ఇక్కడ నుంచి పోటీ చేయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ పార్టీలో మూడు కుంప‌ట్లు పెరిగిపోయాయి. ఇక‌, వీటికితోడు మ‌రో నేత మెట్టు గోవింద‌రెడ్డి కూడా ఇప్పుడు వ్యతిరేక గ‌ళం విప్పుతున్నారు., మంత్రి కాల్వ నియోజ‌క‌వ‌ర్గానికి ఏమీ చేయ‌డం లేద‌ని, త‌న అనుచ‌రుల‌కు మాత్రమే ఆయ‌న మంత్రిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇక్కడి ప‌రిస్థితులు టీడీపీకి వ్యతిరేకంగా ఉండ‌డం వైసీపీకి లాభిస్తోంది మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*