ఏపీలో ఆ మంత్రి వార‌సుడు ఎంట్రీ ప‌క్కా..!

క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియొజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక లు ఉన్న‌నేప‌థ్యంలో ఇక్క‌డి నుంచి వార‌స‌త్వ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు విస్తృతంగా సాగుతున్నాయి. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కేఈ ఫ్యామిలీ నుంచి సోద‌రులు విజ‌యం సాధిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన కేఈ ప్ర‌భాక‌ర్ విజ‌యం సాధించారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఈయ‌న 67,640 ఓట్లు సాధించారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్‌,ప్ర‌జారాజ్యం పార్టీలు గ‌ట్టిపోటీ ఇచ్చాయి. అయినా కూడా కేఈ ప్ర‌భాక‌ర్ విజ‌యం సాధించారు.

గత ఎన్నికల్లో…..

ఇక‌, 2014లో ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి పోటీ చేశారు. 62 వేల‌ ఓట్లు సాధించారు. దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌విని సైతం సంపాయించారు. త‌న సోద‌రుడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు. ఇలా రాజ‌కీయాల్లో ముఖ్యంగా టీడీపీలో కేఈ ఫ్యామిలీ హ‌వా సాగుతోంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ త‌మ వార‌సుడిని రంగంలోకి దింపుతున్నారంటూ గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

నియోజకవర్గంలో తిరుగుతూ….

మ‌రోపది మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు రంగంలోకి దిగుతార‌ని అంద‌రూ అంటున్నారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న ప‌త్తికొండ‌లో గ‌త కొన్నాళ్లుగా ఊరూవాడా తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. స్థానిక సమ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ రోడ్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. తాగునీరు, ఉపాధి, విద్యార్థుల‌కు మౌలిక స‌దుపాయాలు ఇలా అన్ని విష‌యాల్లోనూ కేఈ కుమారుడు జాగ్ర‌త్త వ‌హిస్తున్న‌ారు. ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను సైతం అమ‌ల‌య్యేలా చూస్తున్నారు. ఇలా అన్ని ర‌కాలుగానూ ముందుకు సాగుతున్నారు.

పక్కా గ్రౌండ్ వర్క్ తో….

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని రంగంలోకి దింపుతున్న‌ట్టు తాజాగా కేఈ కృష్ణ‌మూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పత్తికొండ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు పోటీ చేస్తారని, ఎప్పటిలాగే అందరూ సహాయ సహకారాలు అందించి గెలిపించాలని ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు. ఏదేమైనా వార‌సుడి ఎంట్రీ కోసం కేఈ ప‌క్కా ప్లానింగ్‌తో గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. కేఈ ఎంత చేస్తున్నా ఇంకా ఎన్నిక‌ల రంగంలోకి దిగ‌క‌ముందే శ్యాంబాబు కాస్త దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో పాటు ఆయ‌న‌పై హ‌త్యా రాజ‌కీయ అభియోగాలు రావ‌డం మైన‌స్‌గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*