టీడీపీలోకి ఎన్టీఆర్ ప్ర‌త్య‌ర్థి….!

ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్‌ జపాంగులు జోరందుకున్నాయి. ఈ లిస్ట్‌లో నిన్నటి వరకు ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేస్తున్నారు. వైసీపీకి చెందిన కొందరు నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆ పార్టీలో టిక్కెట్లు ఇవ్వకపోవడంతో జనసేన, టీడీపీలోకి జంప్‌ చేసేస్తున్నారు. తూర్పుగోదావరితో ప్రారంభమైన ఈ జంపింగుల పర్వం ఇప్పుడు ఉత్తరాంధ్రకు పాకింది. ఉత్తరాంధ్రలోని కీలక జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓ నేత ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమౌతోంది.

ఇప్పటికే ఇద్దరు……

శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన మీసాల నీలకంఠం నాయుడు, మాజీ మంత్రి కోండ్రు మురళి ఇద్దరూ సైకిల్‌ ఎక్కేసిన సంగంతి తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో పలాస నియోజకవర్గానికి చెందిన మరో నేత వజ్జి బాబురావు సైతం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఆయన మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వజ్జి బాబురావు గత ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ సీనియర్‌ లీడర్‌ గౌతు శివాజి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఎన్టీఆర్ పై పోటీ చేసి……

అయినా వచ్చే ఎన్నికల్లో మ‌ళ్లీ తానే పోటీ చేస్తానన్న నమ్మకంతో నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్నారు. జగన్‌ బాబురావును నియోజకవర్గ సమన్వయకర్త పగ్గాలు నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకుల‌కు భాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన ఆకస్మికంగా మరణించాక కూడా జగన్‌ బాబురావును పట్టించుకోలేదు. ఆ తర్వాత సీదిరి అప్పలరాజును జగన్‌ తెరపైకి తేవడంతో మనస్థాపానికి గురైన వజ్జి బాబురావు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే బాబురావు 1994లో దివంగత మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యస్థాపకులు ఎన్టీఆర్‌పై పోటీ చేశారు.

అనుకూల పరిస్థితులు……

ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ నాటి ఉమ్మడి రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో పోటీ మూడు చోట్లా గెలుపొందారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఆయన పోటీ చేయ‌గా ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాబురావు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2002లో ఆయన పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఏదేమైన కీలకమైనా శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీకి కాస్త అనుకూల పవనాలు క్రమక్రమంగా మొదల‌వుతోన్న వేళ ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేస్తుండడం పెద్ద మైన‌స్సే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*