ఆ ఎంపీ వైసీపీలోకి జంప్ చేస్తునట్లేనా?

ysrcongressparty in darsi constiuency

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జంప్ జిలానీలు ఎక్కువయిపోతున్నారు. తమకు ఖచ్చితంగా సీటు వస్తుందనుకున్న పార్టీలో చేరేందుకు సిద్ధమయిపోతున్నారు. ఇప్పటికే అనేకమంది సీట్ కన్ ఫర్మ్ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. తాజాగా అనకాలపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అవంతి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

గంటాయే అడ్డు……

అవంతి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉంది. అయితే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాతుకుపోయి ఉన్నారు. గంటాను కాదని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ తెలుగుదేశం పార్టీ అవంతికి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. గంటాతో కూడా విభేదాలు పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది.

వైసీపీ నేతలతో మంతనాలు…..

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఈసారి మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువేనన్న భావనతో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. విశాఖ రైల్వే జోన్ వంటి సమస్యలు అలాగే ఉండటంతో ఈసారి గెలుపు కష్టమేనని భావించిన అవంతి పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి కూడా దక్కే ఛాన్సుంది. దీంతో ఆయన వైసీపీ లేదా జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీీపీకి పాజిటివ్ వేవ్ ఉండటంతో వైసీపీలోకి వెళ్లేందుకే అవంతి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు తమ వాట్సప్ గ్రూపుల్లో అవంతిని పార్టీలోకి చేర్చుకోవద్దంటూ అప్పుడే తమ నిరసనను తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*