
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుతో తీవ్రంగా రగిలిపోతోన్న ఓ టీడీపీ ఎమ్మెల్యే పార్టీలో ఉండాలా ? బయటకు వెళ్లాలా ? ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో ఎలా ఉండాలని తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బంధుత్వం అంతా వైసీపీలో ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబు తీరుతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఓపెన్‌గానే, పబ్లిక్ మీటింగులలోనే టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం తప్పుపట్టి పెద్ద సంచలనానికే తెరదీశారు.
ఎంపీగా స్వల్ప ఓట్ల తేడాతో గెలిచి…..
మోదుగుల అసంతృప్తికి కారణం ఏంటన్నది పరిశీలిస్తే 2009లో ఆయన నరసారావుపేట ఎంపీగా గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయన 1300 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు ఆయన్ను చంద్రబాబు పట్టుబట్టి రాయపాటి టీడీపీలోకి రావడంతో మోదుగుల సిట్టింగ్ సీటు ఆయనకు ఇచ్చి మోదుగులను గుంటూరు వెస్ట్‌కు పంపారు. అయితే ఆ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా మోదుగులకు స్వయానా బావ అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పోటీ చేయడంతో బాబు మోదుగులను మార్చడానికి ఓ కారణం.
మంత్రి పదవి ఇస్తారనుకుని….
మోదుగుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానని అన్నారని చెప్పుకున్నారు. వాస్తవంగా బాబుకు, మోదుగలకు మధ్య ఏం జరిగిందో తెలియదు గాని మోదుగుల మాత్రం తన మంత్రి పదవి అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. మొన్న ప్రక్షాళనలో ఆయన మంత్రి పదవి గ్యారెంటీ అని భావించారు. వైసీపీ నుంచి వచ్చిన అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చి మోదుగులను పక్కన పెట్టేశారు.
మాచర్లకు పంపాలని చూస్తుండటంతో….
అప్పటి నుంచి బాబుపై మోదుగుల రగులుతున్నారు. తాజాగా ఇప్పుడు ఆయన సీటును మళ్లీ మార్చి మాచర్లకు పంపాలని చూస్తున్నారు. అక్కడ టీడీపీ గత నాలుగు ఎన్నికల్లోనూ గెలవలేదు. దీంతో అలాంటి కష్టమైన సీటుకు మార్చేయాలని అధిష్టానం భావిస్తుండడంతో మోదుగుల కోపం పరకాష్టకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని మోదుగుల సన్నిహితులు కూడా చెపుతున్నారు.
నరసారావుపేట అసెంబ్లీపై గురి…
ఎన్నికలకు ముందు ఈ సారి అయినా తన అభిప్రాయానికి పార్టీ విలువ ఇవ్వకపోతే మోదుగుల వైసీపీలో జంప్ చేసి నరసారావుపేట ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఎన్నికల వరకు టీడీపీలోనే ఉండి…ఆ తర్వాత పార్టీ మారాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు కూడా సమాచారం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ప్రస్తుతం నరసారావుపేట వైసీపీ లోక్‌సభ ఇన్చార్జ్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ మోదుగులకు బంధువులే. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
Leave a Reply