అక్కడ టీడీపీకి ఎదురు గాలి…!

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌కు ముఖ ద్వారం వంటి అమ‌లాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఇక్కడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన మాజీ కాంగ్రెస్ నాయ‌కుడు జీవీ హ‌ర్షకుమార్‌.. 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, మ‌రో ఆరు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌ళ్లీ యాక్టివ్ కావాల‌ని నిర్ణయం తీసుకోవ‌డంతో అమ‌లాపురం పార్లమెంటు ఎన్నిక‌ల వ్యవ‌హారం మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నాయ‌కుడు, ఐఆర్ ఎస్ మాజీ ఉద్యోగి పండుల రవీంద్రబాబు ప్రాతినిథ్యం వ‌హి స్తున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన అమ‌లాపురంలో గ‌తంలో టీడీపీకి మంచి ప‌ట్టుంది.

ఆయనికిస్తే…..

గ‌తంలో ఇక్కడ నుంచి గంటి మోహ‌న చంద్రబాల యోగి వ‌రుస విజ‌యాలు సాధించి పార్లమెంటు స్పీక‌ర్‌గా చేశారు. ఇక‌, ప్రస్తుతం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌వీంద్రబాబు.. కు చేతి వాటం ఎక్కువ‌గా ఉంద‌నే ప్రచారం జ‌రుగు తోంది. ఇక్కడ రిల‌య‌న్స్‌, గుజ‌రాత్ గ్యాస్ కంపెనీ వంటివి ఉండ‌డంతో వీటి వ‌ల్ల ఇక్కడ ప్రజ‌ల‌కు కాలుష్య స‌మ‌స్యలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను ప్రశ్నించి.. ప్రత్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించాల్సిన ర‌వీంద్ర బాబు ఆయా సంస్థల విష‌యంలో ఉదాసీనంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు ఉన్నాయి. పార్లమెంటుకు ఠంచ‌నుగా హాజ‌ర‌య్యే రవీంద్రబాబు.. ప్రజా స‌మ‌స్యల‌ను మాత్రం ప‌ట్టించుకోరనే పేరు తెచ్చుకున్నారు.

రసవత్తరమే ఈసారి…..

దీంతో ఇక్కడ ర‌వీంద్ర బాబుకు వ్యతిరేకంగా రాజ‌కీయాలు సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ర‌వీంద్ర బాబుకే కేటాయిస్తే.. ఓట‌మి ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో మాజీ ఎంపీ హ‌ర్షకుమార్ జ‌న‌సేన‌లోకి చేరి. ఆ పార్టీ టికెట్ పై అమ‌లాపురం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే ప్రచారం ఉంది. ఇది జ‌రిగితే.. ఇక్కడ పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌ని చెబుతున్నారు. ఇక్కడే మ‌రో విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది టీడీపీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్ని క‌ల్లో పండుల‌కు ఎలాగూ టికెట్ ల‌భించే అవ‌కాశం లేద‌ని, ఈవిష‌యంలో చంద్రబాబుకు సైతం క్లారిటీ ఉంద‌ని ఓ వర్గం సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు.

సరైన ప్రచారం చేయక…..

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి గంటి మోహ‌న చంద్ర బాల‌యోగి కుమారుడు హ‌రీశ్‌ను రంగంలోకి దింపాల‌ని బాబు యోచిస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గత ఎన్నిక‌ల్లో మాజీ కాంగ్రెస్ నాయ‌కుడు పినిపె విశ్వరూప్ ఇక్కడ నుంచి బ‌రిలోకి దిగారు అయితే, ఆయ‌న స‌రైన పోటీ ఇవ్వలేక పోయార‌నే విష‌యం తెలిసిందే. పండుల ర‌వీంద్ర బాబు కొత్త అయిన‌ప్పటికీ. ఇక్కడి ప్రజ‌లు ఆయ‌న‌ను గెలిపించ‌డానికి కార‌ణం. పినిపె స‌రైన విధంగా ఎన్నిక‌ల ప్రచారం చేయ‌లేక‌పోయార‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ ప‌డ‌తార‌నే విష‌యం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఉన్న టీడీపీ, జ‌న‌సేనల స‌మాచారం ప్రకారం బాల‌యోగి త‌న‌యుడు రంగంలోకి దిగినా.. హ‌ర్షకుమార్ జ‌న‌సేన టికెట్ సంపాయించి పోటీ చేసినా.. ఫ‌లితం డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*