మూడింటిలో మూడినట్లేనా…?

telugudesamparty-in-nellore-district

మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు. పైగా అత్యంత పోటా పోటీగా గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఈ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్రిముఖ పోటీ అత్యంత గ‌ట్టిగా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. ఒక‌ప‌క్క అధికార పార్టీ టీడీపీ గ‌ద్దె దింపేందుకు వైసీపీ, మ‌రోప‌క్క జ‌న‌సేన‌లు కాచుకుని కూర్చున్నాయి. మ‌రి ఈ స‌మ‌యంలో అధికార పార్టీ నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఒక్క పార్టీ అదినేత చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డితే.. రోజూ 18గంట‌ల‌పాటు ప్ర‌జ‌ల్లో ఉంటే స‌రిపోతుందా? క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ప‌ట్టించుకునే ప‌నిలేదా? ఇప్పుడు ఈ ప‌రిస్థితే తెర‌మీదికి వ‌స్తోంది. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఓటు, ప్ర‌తి సీటు ముఖ్య‌మ‌నే విష‌యాన్ని ఎవ‌రో వ‌చ్చి చెప్పాలా?

కలుపుకుని వెళ్లడంలో….

ఇప్పుడు ఈ ప్ర‌శ్న నెల్లూరులోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గూడూరు, వెంక‌ట‌గిరి, టీడీపీకి కంచుకోట వంటి సూళ్లూరు పేట‌ల్లో పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. దీనికి క్షేత్ర‌స్థాయి నాయ‌కులు, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి చేరిన నాయ‌కులు కూడాకార‌ణంగానే క‌నిపిస్తున్నారు. గూడూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వైసీపీ విజ‌యం సాధించింది. అయితే, ఇక్క‌డ నుంచి గెలిచిన పాశం సునీల్ త‌ర్వాత కాలంలో టీడీపీలో చేరిపోయారు. అయితే, ఈయ‌న టీడీపీ నేత‌ల‌ను క‌లుపుకొని వెళ్ల‌డంలో విఫ‌లం అయ్యారు. ఆధిప‌త్య ధోర‌ణికి దారులు ప‌రిచారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి అన్నీ తామై వ్య‌వ‌హ‌రించిన నాయ‌కులు ఒక్క‌రొక్క‌రుగా ప్ర‌తిప‌క్షానికి ద‌గ్గ‌ర‌య్యారు.

వైసీపీ గాలం వేసి….

అంతేకాదు, కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న వైరాన్ని మ‌రిచిపోయి మ‌రీ టీడీపీ నేత‌లు వైసీపీలోని నాయ‌కుల‌తో చేతులు క‌లి పారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, వెంక‌ట‌గిరిలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వెంక‌ట‌గిరిని గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కైవ‌సం చేసుకుంది. వ‌రుస విజ‌యాల‌తో జోష్ మీదున్న కొరుగుండ్ల రామ‌కృష్ణ పార్టీని న‌డిపిస్తున్నా.. నేత‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని మాత్రం ఆయ‌న ప‌సిగ‌ట్ట‌లేక పోతున్నారు. వారిని బుజ్జ‌గించ‌లేక పోతున్నారు కూడా ఈ నేప‌థ్యంలోనే ఓ కీల‌క నాయ‌కురాలికి వైసీపీ గేలం వేసింది. దీంతో ఆమె రేపో మాపో పార్టీ మారేందుకురెడీ అవుతున్నారు. ఇక‌, ఇక్క‌డి వెంక‌ట‌గిరి రాజులు కూడా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

సఖ్యత కుదరక…..

మ‌రోప‌క్క‌, టీడీపీకి కంచుకోట వంటి సూళ్లూరు పేట‌లోనూ ఇలానే ఉంది. గంగా ప్ర‌సాద్‌, వేనాటి కుటుంబాల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన ప‌ర‌సా వెంక‌ట‌ర‌త్నం చురుగ్గా తిరుగుతున్నా.. ఆయ‌న‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ టీడీపీ పుంజుకుంటుందా లేక చ‌తికిల ప‌డుతుందా? అనే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా నాయ‌కులు అంద‌రూ సీనియ‌ర్లే కాబ‌ట్టి.. ఒకే వేదిక‌పైకి వ‌చ్చి .. పార్టీని బ‌తికించుకునేందుకు తిరిగి అధికారంలోకి వ‌చ్చేలా వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు స‌మాయ‌త్తం కావాల‌ని ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*