గంపెడాశలు.. నెరవేరతాయా..??

telugudesamparty-in-visakhapatnam

పదవులు ఎవరికి చేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చిందే పదవుల కోసం. మరి కళ్ళు కాయలు కాచేలా వేచింది కూడా దానికే. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎస్ ఎ రహమాన్ టీడీపీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవులు తనకు తప్పక వరిస్తాయని చాలా ఆశ పెట్టుకున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంత్రి స్థాయిలో చేసినంత హడావుడి చేశారు. నిజానికి విశాఖ సౌత్ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయాల్సి ఉంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇచ్చారు. దాంతో పార్టీ పదవి దక్కింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఉడా చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

రెండు దశాబ్దాలుగా దూరం….

టీడీపీలో సీనియర్ నేతగా, మైనారిటీ నాయకునిగా ఉన్న రహమాన్ 1999 తరువాత ఎమ్మెల్యే కాలేదు. ఆయన మధ్యలో ఓసారి ఉడా చైర్మన్ గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. దాంతో 2009 ఎన్నికల్లో ప్రజరాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆ తరువాత టీడీపీలో తిరిగి చేరినా 2014 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఇపుడు కూడా మరోసారి మొండి చేయి చూపించారని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ పవర్లోకి వస్తే చాలు తనకు మంత్రి పదవికి సరిసాటి అయిన ఉడా చైర్మన్ ఇస్తారని రహమాన్ భావిస్తున్నారు.

సౌత్ లో గెలిపించారా…?

ఇవన్నీ సరే కానీ విశాఖ సౌత్ లో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గెలుపునకు రహమాన్ ఎంతవరకు సహకరించారో చూసిన మీదటనే అయన‌కు కొత్త పదవులు ఇస్తారని అంటున్నారు. పోలింగ్ అనంతరం సర్వేలు చూస్తే రహమాన్ వర్గం సరిగ్గా పనిచేయలేదని వాసుపల్లి వర్గం గరం గరం అవుతోంది. అంతకు ముందు ఈ రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంది. అటువంటి పరిస్థితుల్లో రహమాన్ వాసుపల్లి విజయానికి సహకరించకపోవచ్చునన్న అనుమానాలు పార్టీలో ఉన్నాయి.

పదవులు ఖాయమని…

మరి తన సొంత అసెంబ్లీ సీటులో టీడీపీని గెలిపించకుండా పార్టీ గెలిస్తే పదవులు ఎలా దక్కుతాయని పార్టీలో ప్రత్యర్ధి వర్గం అంటోంది. ఇక రహమాన్ తో పాటు పలువురు సీనియర్ తమ్ముళ్ళు ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే పదవులు ఖాయమని ఆశపడుతున్నారు. ఒకవేళ టీడీపీ రాకపోతే వైసీపీలోకి జంప్ చేసైనా పదవులు పొందాలని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి గెలుపుతోనే టీడీపీ భవిష్యత్తు, పార్టీ నాయకుల ఆశలు కూడా ఆధారపడి ఉన్నాయన్నది వాస్తవం.

Ravi Batchali
About Ravi Batchali 16592 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*